మహేష్‌బాబుతో చిలిపి ఆట.. ఓడిన నమత్ర.. ఇంతకు ఆ ఆట ఏమిటంటే
సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్‌డౌన్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు సితార, గౌతమ్‌తో ఆటలాడుకొంటూ చిన్నపిల్లాడిలా మారిపోయారు. క్వారంటైన్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో భార్య నమత్ర శిరోద్కర్‌తో మహేష్ బాబు ఆడిన చిలిపి ఆటకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇంతకు ఆ ఆట ఏమిటంటే..

మహేష్ లాక్‌డౌన్ గేమ్స్
మహేష్, నమత్ర దంపతులు తమ పిల్లలతో కలిసి సరదాగా ఓ ఆట ఆడారు. ఒకరి కళ్లలోకి మరొకరు చూడాలి. ఎవరైతే ముందు కళ్లు ఆర్పుతారో వారు ఓడినట్టు లెక్క. ఈ గేమ్‌ను ఇంట్లో నలుగురు కలిసి సరదాగా మొదలుపెట్టారు. గౌతమ్‌తో ఆటను మొదలుపెట్టిన మహేష్ గెలిచి సంతోషంలో మునిగిపోయారు.

కళ్లలోకి కళ్లు పెట్టి చూడు అంటూ
ఇక కళ్లలోకి కళ్లు పెట్టి చూడు ఆటలో గౌతమ్ ఓడిన తర్వాత నమత్రతో పోటీ పడ్డారు. డైనింగ్ టేబుల్ వద్ద డిన్నర్‌లో భాగంగా ఈ ఆట మొదలైంది. మహేష్ కళ్లలోకి నమ్రత చూడటం మొదలుపెట్టి కాసేపటికే ఆర్పేసింది. కొన్ని సెకన్లలోపే నమ్రత ఓడిపోవడంతో ఆమెను మహేష్ ఆటపట్టించాడు. దాంతో ఓటమి బాధలో కూడా వారిద్దరి ఆనందంగా నవ్వుకోవడం కనిపించింది.

మహేష్‌ను గెలవడం చాలా కష్టం
మహేష్ చేతిలో ఓటమి పాలు కావడంపై నమత్ర స్పందిస్తూ.. సాధారణంగా బ్లింక్ అండ్ యూ లూస్ (కళ్లలోకి కళ్లుపెట్టి చూడు) ఆటను నేను బాగా ఆడుతాను. కానీ మహేష్ కళ్లలోకి ఎందుకో ఎక్కువ సేపు చూడలేకపోయాను. ఆయనను గెలువలేకపోవడం చాలా నిరాశ అనిపించింది. కానీ ఈ ఆటలో ఎవరినైనా ఓడించవచ్చు.. కానీ మహేష్ కళ్లలోకి చూసి గెలవడం కష్టం అని నమత్రా పేర్కొన్నారు.

డెన్‌లో లయన్ అంటూ
అంతేకాకుండా మహేష్ జిమ్‌లో ఉన్న వీడియోను కూడా షేర్ చేసింది. జిమ్ నుంచి బయటకు వస్తున్న మహేష్‌ను ఉద్దేశించి సింహం డెన్లో ఉంది అంటూ కామెంట్‌తో ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. ఇలా క్వారంటైన్ లైఫ్‌ను మహేష్, నమ్రత చిలిపిగా, సరదాగా ఎంజాయ్ చేస్తూ గత రెండు నెలలు ముగించారు.

పరుశురాంతో సినిమా కోసం
ఇక తెలంగాణ ప్రభుత్వం షూటింగులకు అనుమతులు ఇస్తున్న నేపథ్యంలో తన తదుపరి సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సరిలేరు నీకెవ్వరు సినిమా విజయాన్ని ఖాతాలో వేసుకొన్న మహేష్.. తదుపరి చిత్రంగా గీతా గోవిందం దర్శకుడు పరుశురాంతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ముగియగానే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.


Click it and Unblock the Notifications











