మహేష్, సితార డాన్స్ ఇరగదీస్తారు.. గౌతమ్‌కి సిగ్గెక్కువ.. ఫ్యామిలీ గురించి నమ్రత!
భరత్ అనే నేను చిత్ర విజయాన్ని మహేష్ మాత్రమే కాదు.. సూపర్ స్టార్ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తోంది. భరత్ అనే నేను చిత్రం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా సాగుతోంది. మహేష్ బాబు ఈ చిత్రంలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా యుఎస్ లో రికార్డులు తిరగరాస్తోంది. భరత్ అనే నేను చిత్రం విజయం సాధించడంతో మహేష్ సతీమణి నమ్రత కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో నమ్రత తన ఫ్యామిలీ గురించి పలు విషయాలు వెల్లడించింది.

మాటల్లో వర్ణించలేను
భరత్ అనే నేను చిత్రం గురించి నమ్రత మాట్లాడుతూ.. మహేష్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా వర్ణించింది. మహేష్ గత రెండు చిత్రాలు ఫాన్స్ ని నిరాశపరిచాయి. అభిమానులు నిరాశ పాడడం మహేష్ కు ఎప్పుడూ నచ్చదు. ఎలాగైనా ఓ మంచి చిత్రాన్ని వారికి అందివ్వాలని భావించాడు. భరత్ అనే నేను చిత్రంతో అది సాధ్యమైందని నమ్రత అన్నారు. ఆ సంతోషాన్ని మాటల్లో వర్ణించలేనని నమ్రత అన్నారు.

నాతో కథలు చర్చిస్తాడు
మహేష్ కెరీర్ కు సంబందించిన నిర్ణయాలు అతడే తీసుకుంటాడు. తన ప్రమేయం ఉండదని నమ్రత అన్నారు. కానీ కథలని తనతో చర్చించి నా అభిప్రాయం తెలుసుకుంటాడని నమ్రత తెలిపింది.

ఇద్దరు కలసి డాన్స్ ఇరగదీస్తారు
ఖాళీ సమయాల్లో మహేష్ తనతో, పిల్లలతో గడుపుతాడని నమ్రత తెలిపింది. మహేష్, సితార కలసి డాన్స్ చేస్తారు. వారిద్దరూ కలసి ట్రై చేయని డాన్స్ మూమెంట్ ఉండదు. మహేష్ లాగే గౌతమ్ కు కూడా సిగ్గెక్కువ. మహేష్ బలవంత పెడితే కానీ గౌతమ్ డాన్స్ చేయడని నమ్రత తెలిపింది.

ఇంతకు మించిన సంతోషం మరొకటి లేదు
మా వివాహం జరిగి 14 ఏళ్ళు గడిచింది. వివాహానికి ముందు నాలుగేళ్ళ పాటు మా ఇద్దరికీ పరిచయం ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంఘటనలో తామిద్దరం కలసి ఉన్నాం అని నమ్రత అన్నారు. జీవితంలో తామిద్దరం కలిసే ఎదిగాం. ఇప్పుడు మా పిల్లలు కళ్ళముందు ఎదుగుతున్నారు. తనకు ఇంతకు మించిన సంతోషం ఈ ప్రపంచంలో లేదని నమ్రత అన్నారు.

ఆ ప్రశంస ఎప్పటికి మరిచిపోలేను
మిగిలిన హీరోయిన్లు హీరోయిన్లు ఎలాంటి జీవితం గడుపుతున్నారనే విషయం నేను పట్టించుకోను. తాను కెరీర్ లో, జీవితంలో కోరుకున్నవన్నీ దక్కాయి. వాస్తవ్ చిత్రంలో నటించిన తరువాత జయ బచ్చన్ నాకు ఫోన్ చేసారు. నీ నటనకు జాతీయ అవార్డు దక్కాలి అని ప్రశంసించారు. ఆమె మాటలు ఎప్పటికి మరచిపోలేనని నమ్రత అన్నారు.

నా ప్రపంచం వాళ్లే
వివాహానికి నాలుగు సంవత్సరాల ముందే మహేష్ తో పరిచయం ఏర్పడింది. వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ నాలుగేళ్లలో కొన్ని చిత్రాలు పూర్తి చేశా. కుటుంబానికి సంబందించిన విషయాలు చక్కబెట్టా అని నమ్రత అన్నారు. వివాహం జరిగాక ముంబై నుంచి హైదరాబాద్ వచ్చేశా. మహేష్, ఇద్దరు పిల్లలే నా ప్రపంచం అని నమ్రత అన్నారు.


Click it and Unblock the Notifications











