మహేష్ బాబు, సితార ఆదమరిచి.... ఈ ఫోటో చూసి మోసపోవద్దంటున్న నమ్రత!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ విషయాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు ఆమె తన భర్త, పిల్లలకు సంబంధించిన సరదా పోస్టులూ చేస్తుంటారు. తాజాగా నమ్రత చేసిన ఓ ట్వీట్ హాట్ టాపిక్ అయింది.
నమ్రత ట్వీట్ చేసిన ఫోటోలో.... మహేష్ బాబు, సితార ఆదమరిచి నిద్ర పోతున్నట్లు ఉంది. అయితే ఈ ఫోటో చూసి మోసపోవద్దు అనే అర్థం వచ్చేలా ఆమె ఓ హింట్ ఇచ్చారు. ఈ ఫోటోకు ప్రిడెండర్స్ అనే క్యాప్సన్ తగిలించారు. ప్రిటెండర్స్ అంటే నటిస్తున్నారు అని అర్థం.
ఇద్దరూ కలిస్తే అల్లరే అల్లరి
సూపర్ స్టార్ మహేష్ బాబుకు షూటింగ్ లేకుంటే కుటుంబమే ఆయన ప్రపంచం. పూర్తి సమయం ఫ్యామిలీతో గడిపేస్తుంటారు. ఇక సితార, మహేష్ బాబు కలిస్తే మామూలుగా ఉండదు. అల్లరి చేసినా, ఆటలాడినా తన కూతుతోనే. వారు అలా సరదాగా గడుపుతుంటే నమ్రత ఆ హ్యాపీ మూమెంట్స్‌ను కెమెరాతో బంధించి అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

రేర్ మూమెంట్స్
నాన్నతో కలిసి సితార ఆటలాడుతుండగా నమ్రత తన ఫోటోగ్రఫీ టాలెంటుకు పదును పెట్టారు. తన సూపర్ స్టార్‌కు సంబంధించిన రేర్ మూమెంట్స్ కెమెరాలో ఇలా బంధించారు.

పిల్లలకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ
మహేష్ బాబు సంవత్సరంలో కనీసం నాలుగు సార్లయినా విదేశీ ట్రిప్స్ వేస్తుంటారు. పిల్లలకు స్వయంగా ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ లోకంలోని వింతలు చూసి వారు ఆనంద పడుతుంటే చూసి మురిసిపోతుంటారు.

మహేష్ బాబు మూవీస్
మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ తర్వాతి షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ వారమే అంతా కలిసి యూఎస్ఏ వెళుతున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు, పివిపి నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5, 2019లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











