మేకప్ వేసుకో.. నోరు పారేసుకొన్న నెటిజన్.. దిమ్మ తిరిగే జవాబిచ్చిన నమత్ర

సూపర్‌స్టార్ మహేష్ బాబు మరోసారి తన ఫెర్ఫార్మెన్స్‌తో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఆకట్టుకొన్నారు. తాజాగా రిలీజైన మహర్షి చిత్రంలో ఆయన నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహర్షి సినిమా భారీ కలెక్షన్లతో దూసుకెళ్తూ ప్రిన్స్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా సక్సెస్ రేసులో దూసుకెళ్తున్న నేపథ్యంలో మహేష్ బాబు, దర్శకుడు వంశీ పైడిపెళ్లి, ఇతరుల విందు చేసుకొన్నారు. ఈ విందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

సక్సెస్ పార్టీ ఫోటోను

సక్సెస్ పార్టీ ఫోటోను

మహర్షి సక్సెస్ పార్టీకి సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ షేర్ చేశారు. మహర్షి సినిమా సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్ చేసినందుకు వంశీ పైడిపల్లి థ్యాంక్యూ. ఎపిక్ బ్లాక్‌బస్టర్ సాధించిన నేపథ్యంలో ఈ రాత్రి మధుర అనుభవంగా మిగిలిపోతుంది అని ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

కొంచెం మేకప్ వేసుకోవచ్చుగా

కొంచెం మేకప్ వేసుకోవచ్చుగా

నమత్ర షేర్ చేసిన ఫొటోను ఉద్దేశించి ఓ నెటిజన్ నోరు పారేసుకొన్నాడు. నమ్రత.. మీ ముఖానికి కొంచెం మేకప్ వేసుకోవచ్చుగా. మీరేమన్నా డిప్రెషన్‌తో బాధపడతున్నావా అంటూ నెటిజన్ కామెంట్ విసిరారు. కాగా ఫ్యాన్స్ మాత్రం ఈ సక్సెస్ పార్టీ ఫొటోపై సానుకూలంగా కామెంట్లతో స్పందించారు.

నీకు అలాంటోళ్లే ఇష్టమయితే

నీకు అలాంటోళ్లే ఇష్టమయితే

తనపై మేకప్ గురించి కామెంట్ చేసిన నెటిజన్‌కు నమత్ర శిరోద్కర్ ధీటుగా జవాబిచ్చింది. నమత్ర ఇచ్చిన జవాబు నెటిజన్‌కు దిమ్మతిరిగేలా చేసింది. నీవు మేకప్ వేసుకొన్న మహిళనే ఇష్టపడుతావేమో. ఎర్రగా బుర్రగా తయారయ్యే వారినే నీవు ఫాలో కావొచ్చు. వాళ్లే నీకు టేస్ట్‌కు సూట్ అవుతారేమో. ఇక నా ఇన్స్‌టాగ్రామ్ పేజ్‌లో నీవు కనిపించకపోవచ్చు. లేకపోతే నీవే నా అకౌంట్ నుంచి తప్పుకోవాలని సిన్సియర్‌గా రిక్వెస్ట్ చేస్తున్నాను అని జవాబిచ్చింది.

భారీ కలెక్షన్లతో మహర్షి

భారీ కలెక్షన్లతో మహర్షి

ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన మహర్షి భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అల్లరి నరేస్ కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా రెండు రోజుల్లో సుమారు రూ.40 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X