»   » పిక్ టాక్: మహేష్ బాబు భార్యను, కూతురును ఇలా చూసుండరు!

పిక్ టాక్: మహేష్ బాబు భార్యను, కూతురును ఇలా చూసుండరు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేష్ బాబుకు ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయం నమ్రత పోస్టు చేసే విషయాల ద్వారానే బయటి ప్రపంచానికి తెలుస్తుంటాయి. తాజాగా నమ్రత పోస్టు చేసిన ఓ పిక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా నమ్రత, సితార ఈ ఫోటోలో కనిపించడమే అందుకు కారణం.

 ట్రెడిషనల్ లుక్ అదిరింది

ట్రెడిషనల్ లుక్ అదిరింది

తల్లి కూతుళ్లు ఇద్దరూ కలిసి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇంత అద్భుతమైన లుక్ లో ఇద్దరూ ఎప్పుడూ కనిపించలేదని, ముఖ్యంగా సితార లుక్ చాలా క్యూట్ గా ఉందని అంటున్నారు అభిమానులు.

Mahesh Babu wishes to His Daughter Sitara
 సితార, నమ్రత

సితార, నమ్రత

ఇద్దరూ కలిసి ఇటీవల ఏదో కార్యక్రమం కోసం బయటకు వెళ్లారు. ఈ సందర్భంగా నమ్రత ఈ ఫోటో పోస్టు చేశారు. ఎథ్నిక్ సల్వార్ ధరించిన నమ్రత ఎంతో అందంగా కనిపించారు. సితార పింక్ టాప్, బ్లూ లెహంగా ధరించి క్యూట్ లుక్ తో ఆకట్టుకుంది.

నమ్రత

నమ్రత

నమ్రతా శిరోద్కర్..... టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య మాత్రమే కాదు, ఆయన వెనక ఉండి అన్ని విషయాలు జాగ్రత్తగా చూసుకునే పవర్ ఫుల్ ఉమెన్. మహేష్ బాబు ఫ్యామిలీ, కెరీర్, సేవా కార్యక్రమాలు, ఇతర అంశాలకు సంబంధించిన ప్రతీదానిలోనూ నమ్రత ప్రమేయం ఉంటుంది. బాబు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి. ఈ విషయాన్ని మహేష్ బాబు పలు సందర్భాల్లో స్వయంగా వెల్లడించారు. ఇటీవల నమ్రత పుట్టినరోజు సందర్భంగా కూడా ఆమె తనకు ఎంత ప్రత్యేకమో లవ్లీ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

 అన్యోన్య దాంపత్యం

అన్యోన్య దాంపత్యం

మహేష్ బాబు-నమ్రత ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గత దశాబ్ద కాలంగా ఈ జంట అన్యోన్య దాంపత్యం సాగిస్తున్నారు. టాలీవుడ్లోని ది బెస్ట్ కపుల్స్‌లో వీరూ ఒకరు.

English summary
Namrata donned the ethnic salwar and Sitara wore the pink top beautiful blue lehenga. That is a perfect picture that a mother and daughter could get.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu