పిల్లల కోసం వేలానికి పెట్టిన మహేష్ భార్య నమ్రత (ఫోటోస్)
హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం కొర్పొరేట్ బ్రాండ్లకు మాత్రమే కాదు....సమాజానికి సేవ చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రచారం చేస్తూ తనలోని సేవా భావాన్ని చాటుతున్నాడు. గతంలో మహేష్ బాబు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోదించడానికి చేపట్టిన 'MARD' ప్రచార కార్యక్రమంలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే.
దీంతో పాటు 'హీల్-ఎ-చైల్డ్' అనే స్వచ్చంద సంస్థకు గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తున్నారు. ఐదేళ్లుగా ఈ సంస్థ చిన్నారుల ఆరోగ్యం గురించి ఎంతో సీరియస్‌గా పని చేస్తుంది. అనారోగ్యం పాలైన పేద చిన్నారులకు చికిత్స అందించడంలో ఈ సంస్థ ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ సంస్థ కార్యకలాపాల్లో మహేష్ బాబు భార్య నమ్రత కూడా పాలుపంచుకుంటోంది.
మిగతా వివరాలు స్లైడ్ షోలో...

‘హీల్-ఎ-చైల్డ్'
గతంలో ‘హీల్-ఎ-చైల్డ్' సంస్థ తరుపున జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నమ్రతా శిరోద్కర్.

హుస్సేన్ పేయింటింగ్
స్వతహాగా పెయింటింగ్‌ల సేకరణపై ఆసక్తి ఉన్న నమ్రత తన దగ్గరున్న ప్రసిద్ధ వర్ణచిత్రాల్ని వేలం వేయిస్తున్నారు. అలా వచ్చిన సొమ్మును పిల్లల బాగు కోసం కృషి చేసే ‘హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్' అనే సేవాసంస్థకు అందించనున్నారు. ఈ నెల 27న జరగనున్న ‘బిడ్ అండ్ హ్యామర్' వేలంలో తన దగ్గరున్న ప్రసిద్ధ కళాకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్‌ను విక్రయించాలని నమ్రత నిర్ణయించుకున్నారు.

హుస్సేన్ తో పరిచయం
పదిహేనేళ్ల క్రితం నమ్రత సోదరి శిల్ప నటటించిన ఓ సినిమా సమయంలో .....ఎంఎఫ్ హుస్సేన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయంతోను ఆయన గీసిన బొమ్మ కావాలని అడిగాను. ఆ తరువాత కొద్ది రొజులకే ఆయన తాను గీసిన గుర్రపు బొమ్మల పెయింటింగ్‌ను కానుకగా ఇచ్చారు అని నమ్రత చెప్పుకొచ్చారు.

ఇష్టం లేక పోయినా...
ఈ పెయింటింగ్స్ అమ్మడం ఆమెకు ఇష్టం లేక పోయినా...ఒక మంచి పని కోసం కాబట్టి సంతోషంగా ఉందని నమ్రత చెబుతోంది.


Click it and Unblock the Notifications











