మహేష్ భార్య కూడా..

By Staff

మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ఇంటి దగ్గర ఖాలిగా ఏమి కూర్చుంటాము అనుకుందో ఏమో తాజాగా టీవీ లలో కనిపించటానికి ప్లాన్ చేసుకొంది. పెళ్లి అయ్యాక సినిమాలకు స్వస్తి చెప్పిన సోదరి శిల్పా శిరోద్కర్ తో కలిసి నమ్రత ఓ టీవీ డాన్స్ రియాలిటీ షో కి జడ్జిగా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని నమ్రత స్వయంగా ధ్రువీకరించింది. పిల్లల కోసం చేసే ఈ డాన్స్ రియాలిటీ షోలో తానూ, శిల్పా కలిసి తొలిసారి కనిపించడనుండటం తో చాలా ఎగ్జయింటింగ్ ఉందని చెపుతోంది. ఇక ఇప్పటికే పెళ్ళయిన లయ వంటి చాల మంది ఒకప్పటి సిని హీరోయిన్స్ ఈ తరహా షో లలో పాల్గొంటున్నారు.

ఇక ఈ షో కోసం తరచు ముంబై వెళ్లవలసి ఉన్నది అని చెప్పింది . అప్పటికీ అది ఇంటికి దూరమైనట్టు కాదనీ, ప్రస్తుతం షూటింగ్ అంతా హైద్రాబాద్ లోనే షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నామనీ, అందువల్ల సిటీ వదిలి వెళ్లాల్సి వస్తుందనే బెంగ లేదనీ చెప్పుకొచ్చింది. టీవీ షోలో తొలిసారి రంగప్రవేశం చేస్తున్నసమయం లో మునుముందు మరింత బిజీ అయ్యే అవకాశాలపై ప్రశ్నించినప్పుడు, మరిన్ని షోలు చేయాల్సిందిగా పలు ఛానెల్స్ కోరుతున్నాయనీ, అయితే ప్రస్తుతం అవన్నీ చర్చల దశలోనే ఉన్నందున త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తాననీ నమ్రత తెలిపింది.

అలాగే ఆమె నిర్మాతగా కూడా మారి సొంతంగా ఓ బుల్లితెర షోను నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. మరాఠీ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ కోసం ఈ షో రూపకల్పన జరుగుతోందని నమ్రత తెలిపింది. మరాఠీ తన మాతృభాష కావడంతో తొలిసారి ఈ వెంచర్ చేపడుతున్నట్టు పేర్కొంది. బెస్ట్ అఫ్ లక్ నమ్రత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X