మహేష్‌పై ప్రేమను... నమ్రత ఇలా టాటూ రూపంలో!
హైదరాబాద్: హీరో మహేష్ బాబు, తన కోస్టార్ నమ్రతను 8 ఏళ్ల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వంశీ చిత్రంలో తనతో పాటు కలిసి నటించిన నమ్రతతో దాదాపు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు మహేష్. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా గౌతం కృష్ణ, సితారలు జన్మించారు.
సినిమా రంగంలోని జంటల్లో చాలా మంది వారి లైఫ్ స్టైల్ దృష్ట్యా ఎక్కువ కాలం కలిసి జీవించే వారి సంఖ్య తక్కువే. వేళ్లపై లెక్కించదగ్గ కొందరు మాత్రమే ఒకరిపై ఒకరు తరగని ప్రేమతో కలకాలం అన్యోన్యం దాంపత్యం గడుపుతుంటారు. ఇప్పటికీ ఎలాంటి కలతలు లేకుండా జవిస్తున్న అలాంటి జంటల్లో మహేష్ బాబు-నమ్రతలను ముఖ్యులుగా చెప్పుకోవచ్చు.
తాజాగా నమ్రత తన భర్త, పిల్లలపై ప్రేమను చాటు కుంటూ తన చేతిపై వారి పేర్లను టాటూగా వేయించుకుంది. దేవనాగరి స్టైల్ అక్షరాల్లో వాటిని రాయించుకుంది. దీని గురించి ఆమె మాట్లాడుతూ 'నేను చాలా కాలం నుంచి టాటూ వేయించుకోవాలనుకుంటున్నాను. నేను దీని గురించి ఎక్కువ గా మాట్లాడదలుచుకోలేదు, ఇదంతా నా వ్యక్తగతం' అని చెప్పుకొచ్చారు. నమ్రత తన క్లోస్ ఫ్రెండ్స్ వద్ద ఈ టాటూ గురించి చెబుతు ఇది ప్రపంచంలోనే బెస్ట్ టాటూ అంటూ సంబర పడిపోతోందట.
మహేష్ బాబు సినిమాల గురించి మాట్లాడుకుంటే...ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications












