డబ్బుకోసమే, సేవ చేయలేదు....పద్మ అవార్డు నాకెందుకిచ్చారో?
గుర్‌గావ్: కదార్ పూర్లో ప్రారంభమైన జీవీ మాల్వంకర్ ఓపెన్ నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. పద్మ అవార్డు గురించి, భారతరత్న అవార్డు గురించి ఆయన సంచలన కామెంట్స్ చేసారు.
గతేడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న పాటేకర్.....ఓ ప్రశ్నకు స్పందిస్తూ నేను సినిమాల్లో డబ్బుకోసమే పని చేసాను. సమాజ సేవ చేయలేదు. పద్మ అవార్డు ఎందుకిచ్చారో తెలియదు అన్నారు. పద్మ అవార్డులు కేవలం సెలబ్రిటీలకు మాత్రమే ఇస్తున్నారని, నిజమైన సేవ చేసే వారిని ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు.

క్రీడాకారుల్లో తొలిసారిగా సచిన్ టెండూల్కర్‌కు భారత రత్న అవార్డు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సబబేనా? అన్న ప్రశ్నకు నానా పాటేకర్ స్పందిస్తూ.......నా అభిప్రాయం ప్రకారం క్రీడాకారుల్లో తొలిసారి భారరత్న అవార్డు ఇవ్వాల్సి వస్తే హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్‌కు ఇవ్వడమే కరెక్ట్ అని సమాధానం ఇచ్చారు.
ఈ అవార్డుల గోల సంగతి పక్కన పెడితే.....ఈ షూటింగు చాంపియన్ షిపల్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి నానా పాటేకర్...ఒలంపియన్ గగన్ నారంగ్ రైఫిల్‌తో షూటింగులో పాల్గొన్నారు. అయితే తక్కువ స్కోరు మాత్రమే చేసారు. 450 పాయింట్ల స్కోరు మాత్రమే చేసారు. నేను కనీసం 550 పాయింట్ల స్కోరు చేసారు. కానీ ఈ సారి గురి తప్పింది. తన పెర్ఫార్మెన్స్‌ను 'బ్యాడ్ షూట్ విత్ గోల్డోన్ గన్' అని పేర్కొన్నారు. ఈ ఛాంపియన్ షిప్‌లో దేశం నలుమూలల నుండి 600 మంది షూటర్లు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











