బాలయ్య ఫోటోలతో 2015 క్యాలెండర్

By Bojja Kumar

హైదరాబాద్: నందమూరి బాలయ్య అభిమాని ఒకరు ఆయన ఇటీవల నటించిన ‘లెజెండ్' సినిమాలోని ఫోటోలతో 2015 క్యాలెండర్ తయారు చేయించారు. త్వరలో ఈ క్యాలెండర్లు అభిమానులకు పంపిణీ చేయబోతున్నారు. ఈ క్యాలెండర్‌పై బాలయ్య లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది.

అన్నగారి వారసుడిగా తెలుగు సినీ కళామతల్లి ఒడిలో బాలయ్య 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ క్యాలెండర్ తయారు చేయించారు. ఈ క్యాలెండర్లో బాలయ్య చిన్నతనం నుండి ఇప్పటి వరకు నటించిన వివిధ చిత్రాల్లోని ఫోటోలు ఉండటం గమనార్హం. ఆ క్యాలెండర్‌పై మీరూ ఓ లుక్కేయండి.

బాలయ్య ప్రస్తుతం సత్య దేవ దర్శకత్వంలో ‘లయన్'(ఇంకా ఖరారు కాలేదు) చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. . పుల్ మాస్ లుక్ లో బాలయ్య గెటప్ అదిరి పోయింది. ఫస్ట్ లుక్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

 Nandamuri Balakrishna 2015 calendar

ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష, రాధికా ఆప్టే రొమాన్స్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, జయసుధ, ఆలీ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను పారిశ్రామికవేత్త రమణారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్న చిత్ర యూనిట్ గతంలో గాడ్సే వారియర్ అనుకున్నారు.

కానీ ఆ టైటిల్స్ బాలయ్య ఇమేజ్ కు తగిన విధంగా లేక పోవడంతో ‘లయన్ ' పేరు ఓకే చేసే ఆలోచనలో ఉన్నారు. టైటిల్ లో సింహం కలిస్తే బాలకృష్ణ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ తో ఈ టైటిల్ నే ఖరారు చేస్తారని సమాచారం. త్వరలో సినిమాకు సంబంధించిన టైటిల్, రిలీజ్ డేట్ ఖరారు కానున్నాయి. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X