ఆ విషయం నా వరకు రాలేదు.. ఆ మాట నా చెవిన పడింది.. బాలకృష్ణ

మెగా, నందమూరి కుటుంబాల మధ్య మాటల విసుర్లు తాజాగా మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తాను పెట్టాల్సిన మంట పెట్టేసిన బాలకృష్ణ ప్రస్తుతం తన పనేదో తాను చూసుకొంటున్నారు. జూన్ 10న 60వ జన్మదినం జరుపుకొన్న బాలయ్య పలు మీడియా, యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూలతో అదరగొట్టారు. తాజాగా రాజకీయ, సినీ రంగాల విషయాలను ఎలాంటి మొహమాటం లేకుండా పంచుకొన్నారు. తాజాగా కొన్ని విషయాలపై మాట్లాడుతూ..

బోయపాటి శ్రీను సినిమాపైనే

బోయపాటి శ్రీను సినిమాపైనే

సినిమాల పరంగా బోయపాటి శ్రీను సినిమాతో తెరకెక్కిస్తున్న చిత్రంపైనే నా దృష్టి అంతా. ఆ సినిమా పూర్తయ్యేంత వరకు మరో సినిమా చేయకూడదని నిర్ణయించుకొన్నాను. ఎందుకంటే బోయపాటి శ్రీను సినిమాలో గెటప్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంది. అందుకే మరో సినిమా చేయడానికి కుదరదు. కాబట్టి ఆ సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమా. కాకపోతే కథలు వింటున్నాను. కానీ నిర్ణయం తీసుకోలేదు అని బాలకృష్ణ చెప్పారు.

నా డ్రీమ్ ప్రాజెక్ట్స్

నా డ్రీమ్ ప్రాజెక్ట్స్

నాకు నచ్చినవి, నేను చేయాల్సిన కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆదిత్య 363 సినిమాకు సీక్వెల్‌గా ఓ కథ అనుకొన్నాం. ఆదిత్య 999 Max అనే పేరును కూడా అనుకొన్నాం. ఆ సినిమా స్క్రిప్టుపై దృష్టిపెట్టాం. అలాగే గోన గన్నారెడ్డి సినిమా చేయాలనే ఆలోచన ఉంది. కాకపోతే అందులో ఉన్న కొన్ని సమస్యలపై చర్చలు జరుపుతున్నాం. నేను అనుకొనే డ్రీమ్ ప్రాజెక్టులో గోన గన్నారెడ్డి ఒకటి అని బాలకృష్ణ తెలిపారు.

అయ్యప్పనమ్ కోషియమ్ రీమేక్‌పై

అయ్యప్పనమ్ కోషియమ్ రీమేక్‌పై

మలయాళంలో సంచలన విజయం సాధించిన అయ్యప్పనమ్ కోషియమ్ సినిమా రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అందులో నిజమెంత అనే ప్రశ్నకు బాలకృష్ణ స్పందిస్తూ.. సాధారణంగా రీమేక్ సినిమాలకు నేను దూరం. ఆ వార్త నేను కూడా విన్నాను. నా వరకు కూడా వచ్చింది. కానీ దానిపై నాతో ఎవరూ చర్చించలేదు. నన్ను ఎవరూ అడుగలేదు అని బాలకృష్ణ అన్నారు.

అయ్యప్పనమ్ కోషియమ్ సినిమా గురించి

అయ్యప్పనమ్ కోషియమ్ సినిమా గురించి

అయ్యప్పనమ్ కోషియమ్ సినిమా నేను చూడలేదు. మలయాళంలో ఘన విజయం సాధించిందనే వార్త నా వరకు వచ్చింది. ఆ సినిమా బాగుందనే మాట విన్నాను. కానీ కథ బాగుంటే చేయడానికి అభ్యంతరం ఏమీలేదు. రానా దగ్గుబాటి గానీ, మరెవరైనా ఫర్వాలేదు. నాకు మల్టీస్టారర్ సినిమాలంటే ఇష్టం లేదు కానీ కథ బాగుంటే చేయడానికి అభ్యంతరం ఏమీలేదు అని బాలకృష్ణ పేర్కొన్నారు.

Recommended Video

Nandamuri Mokshagna Is Not Ready Yet, Latest Look Goes Viral
అయ్యప్పనమ్ కోషియమ్ 50 కోట్ల కలెక్షన్లతో

అయ్యప్పనమ్ కోషియమ్ 50 కోట్ల కలెక్షన్లతో

అయ్యప్పనమ్ కోషియమ్ చిత్రం రూ.5 కోట్లతో రూపొంది రూ.50 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయ్యప్పన్‌ (రిటైర్డ్ హవల్దార్) పాత్రలో బిజూ మీనన్, సబ్ ఇన్స్‌పెక్టర్ (కోషి) పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించారు. ఈ చిత్రం మలయాళంలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది. హిందీలో ఈ చిత్రాన్ని జాన్ అబ్రహం రూపొందిస్తుండగా, తమిళంలో సూర్య, కార్తీ కలిసి చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X