ఇప్పటికీ నా పేరేంటో వాడికి తెలియదు, చప్పట్లకు ఆవేశపడితే..: బాలయ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నందమూరి బాలకృష్ణ.. వెండితెర పైనే కాదు మీడియా ముందు కూడా ముక్కుసూటిగా మాట్లాడేయగలరు. తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేస్తుంటారాయన. అందుకే కొన్నిసార్లు వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన తన ముక్కుసూటితనం గురించి మరోసారి ప్రస్తావించారు..

Recommended Video

ఫిల్మ్ స్టూడియో ప్లాన్ చేస్తున్న బాలయ్య.. ఎక్కడో తెలుసా ?

 అది మాకే చెల్లుతుంది:

అది మాకే చెల్లుతుంది:

'సినీ ఇండస్ట్రీలో మీలాగా ముక్కుసూటితనం కొంతమందికే ఉంటుంది కదా?.. రాజకీయాల్లోనూ అలాగే ఉంటారు..' అని మీడియా ప్రస్తావించడంతో బాలయ్య ఆసక్తికర సమాధానం చెప్పారు.

'రాజకీయాల్లో ముక్కుసూటితనం మాకే చెల్లుతుంది. నా దృష్టిలో సినిమా నటులందరూ రాజకీయాల్లో రాణించలేరు. ఎంతోమంది రాజకీయాల్లోకి వస్తే ఎలా వుంటుందోనని నాతో అనేవారు. నేను వద్దని వారించేవాణ్ణి.' అన్నారు బాలకృష్ణ.

 'చండశాసనుడే' అన్నారు..:

'చండశాసనుడే' అన్నారు..:

'నాన్నగారిలా అందరూ రాజకీయాల్లో రాణించలేరు. ఇక ముక్కుసూటితనం అంటారా!.. వ్యక్తిత్వాన్ని అది మరింత ఇనుమడింపజేస్తుంది. కొన్ని సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన సమయంలో.. అక్కడి అధికారులతో నేను చర్చించడం చూసి.. మీ నాన్నగారిలా చండశాసనుడే అని ఛమత్కరించారు.'

 జరిగిపోవాలంతే..:

జరిగిపోవాలంతే..:

'మనమేదైనా అనుకుంటే అయిపోవాలంతే. ప్రజలకు మేలు చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాం. అధికారం కోసం కాదు. ప్రజాసేవే మా లక్ష్యం'

'టైమ్' ముఖ్యం..:

'టైమ్' ముఖ్యం..:

కమల్, రజనీల రాజకీయ రంగప్రవేశంపై బాలయ్యను ప్రశ్నించగా.. 'రాజకీయాల్లో ఏం చేసినా టైమింగ్ అనేది ముఖ్యం. రైట్ టైమ్‌లో రావాలి. సినీ ఇండస్ట్రీలో ఒక వైఖరి ఉంటుంది. పక్కనే ఉండి మసిపూసి మారేడికాయ చేసినట్లు కొంతమంది చప్పట్లు కొడుతుంటారు. అంతమాత్రానికే క్షణికావేశం అయిపోతుందనుకుంటారు' అని బాలయ్య అభిప్రాయపడ్డారు.

 దేవాన్ష్ గురించి:

దేవాన్ష్ గురించి:

ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తారన్న ప్రశ్నకు బాలయ్య దేవాన్ష్ గురించి ప్రస్తావించారు. 'దేవాన్ష్ విషయంలో తాత (చంద్రబాబు) నుంచి చాలా ఫిర్యాదులు ఉన్నాయి. అంతా మీ ఆవేశమే వచ్చిందని ఆయన అంటుంటారు. వాడు అనుకున్నది జరగలేదంటే.. చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తుంటాడు.

 ఆయనలా.. నేనిలా..:

ఆయనలా.. నేనిలా..:

దేవాన్ష్ అల్లరిని ఆయన ఎంత సంస్కరించాలనుకుంటుంటాడో నేనంతలా చెడగొడుతుంటాను అని సరదా కామెంట్స్ చేశారు బాలయ్య. బాధ్యతగా ఉండాలని ఈ వయసు నుంచే చంద్రబాబు `దేవాన్ష్ కు చెబతుంటారు. నేను మాత్రం సమాజం అంటూ అన్నీ నేర్పిస్తున్నాను.

 ఇప్పటికీ నా పేరేంటో వాడికి తెలియదు..:

ఇప్పటికీ నా పేరేంటో వాడికి తెలియదు..:

కుటుంబం, పిల్లల పట్ల కాస్త సరదాగా వ్యవహరించాలన్నారు బాలయ్య. తాను ఎప్పుడైనా గంభీరంగా మాట్లాడితే.. దేవాన్ష్ పరీక్షగా చూస్తాడని చెప్పుకొచ్చారు. అంతేకాదు, తనను 'గోల తాత' అంటూ పిలుస్తుంటాడని, ఎవరు నా పేరు అడిగినా అదే చెబుతాడని అన్నారు. లేదంటే.. 'శాతకర్ణి' తాత అంటాడని చెప్పారు. ఇప్పటికీ నా అసలు పేరేంటో వాడికి తెలియదని బాలయ్య చెప్పడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X