»   » వందో సినిమా ఆస్కార్ రేంజిలో ఉంటుందన్న బాలయ్య!

వందో సినిమా ఆస్కార్ రేంజిలో ఉంటుందన్న బాలయ్య!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ తన నెక్ట్స్ సినిమాతో 100వ మైలురాయిని అందుకోబోతున్నారు. అందుకే ఈ సినిమా ఎంపిక విషయంలో బాలయ్య స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. రోటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉండాలని భావించిన ఆయన చివరకు హిస్టారికల్ మూవీ చేయాలని డిసైడ్ అయ్యారు.

కింగ్ గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా బాలయ్య 100వ సినిమా ఉండబోతోంది. ఇటీవల తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్న బాలయ్య అక్కడకు వచ్చిన అతిథులు, సన్నిహితులతో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

Nandamuri Balakrishna about Oscar dream

ఈ వేడుకలో బాలయ్య స్టైలిష్ మీసంతో కనిపించారు. ఈ ఇది చూసి చాలా మంది 100వ సినిమా కోసమేనా? అంటూ ప్రశ్నించినట్లు సమాచారం. అవును, ఈ మీసం పెంచేది 100వ సినిమా కోసమే, క్రిష్ దర్శకత్వం వహిస్తారు. గౌతమిపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం.

అమరావతిని రాజధానిగా చేసుకుని పాలించిన శాతవాహన రాజు గౌతమి పుత్రశాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కే ఈచిత్రం అందరినీ అలరించే విధంగా ఉంటుంది, ఆస్కార్ అవార్డు సైతం దక్కించునే రేంజిలో ఉంటుంది అని బాలయ్య చెప్పినట్లు తెలుస్తోంది. మరి బాలయ్య ఇంత నమ్మకంగా చెప్పడంతో అభిమనుల్లో 100వ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

English summary
"In my next film I am playing the historic character of Gautamiputra Satakarni...I am growing a moustache for the role. I am confident that the film will definitely get an Oscar," a source quoted by a leading daily, was overheard Balakrishna saying it to his fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu