జగన్ మీటింగ్‌కు రానని చెప్పా.. టికెట్ల రేట్లు తక్కువున్నా సమస్య లేదు.. ఎందుకంటే: బాలకృష్ణ

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పలు సమస్యలపై గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సినీ ప్రముఖులు చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల టికెట్ల రేట్ల విషయంలో కొంత మంది స్టార్ హీరోలు దర్శకులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఈ మీటింగ్ కు నందమూరి బాలకృష్ణ కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే నందమూరి బాలకృష్ణ ఆ మీటింగ్ కు రానని చెప్పినట్లు అప్పుడే వార్తలు వచ్చాయి. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి బాలయ్య ఆ విషయంపై చాలా క్లారిటీగా వివరణ ఇచ్చారు.

టాలీవుడ్ కు చేదు అనుభవాలు

టాలీవుడ్ కు చేదు అనుభవాలు

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అక్కడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాన్యులకు కూడా వినోదం అనేది తక్కువ ఖర్చుతో ఉండాలి అనే ఆలోచన తో సినిమా టికెట్లను తగ్గించగా ఆ ఎఫెక్ట్ కొన్ని సినిమాలపై గట్టిగానే ప్రభావం చూపుతోంది. ఇక ఈ విషయంలో రాజకీయం ఉందని కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. టికెట్ల రేట్ల విషయంలో చాలా మంది సినీ ప్రముఖులు ఏపీ అధినేతలను చాలాసార్లు కలిశారు.

సీఎం మీటింగ్ లో..

సీఎం మీటింగ్ లో..


అయితే ఎన్ని చర్చలు జరిగినా కూడా ఇప్పటివరకు టికెట్ల రేట్ల విషయంలో సరైన సమాధానం లభించలేదు. త్వరలోనే సొల్యూషన్ వస్తుందని చెబుతున్నారు గాని అది మాటల వరకే కొనసాగుతోంది. ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో మహేష్ బాబు, ప్రభాస్ దర్శకులు కొరటాల శివ, రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి అలాగే ఆలీ, పోసాని కృష్ణ మురళి వంటి సినీ ప్రముఖులు ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డితో జరిగిన మీటింగ్ లో పాల్గొన్నారు.

 బాలకృష్ణ రాకపోవడంతో..

బాలకృష్ణ రాకపోవడంతో..


అయితే ఈ మీటింగ్ కు కొంతమంది సినీ ప్రముఖులు రాకపోవడంపై ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది సీనియర్ నటీనటులు ఈ విషయంలో అప్సెట్ అయినట్లు కూడా టాక్ వచ్చింది. అయితే నందమూరి బాలకృష్ణ ఆ మీటింగ్ కు రాకపోవడంపై కూడా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే బాలకృష్ణ మెగాస్టార్ ద్వారా ఇన్విటేషన్ అందినప్పటికి కూడా ఆయన రాలేను అని డైరెక్ట్ గానే చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

 ఆ కార్యక్రమంలో..

ఆ కార్యక్రమంలో..


ఇక ఇటీవల బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ విలేకరులు అడిగిన ప్రశ్నకు పలు సమాధానాలు చెప్పారు. సీఎం జగన్ తో ఇటీవల జరిగిన మీటింగ్ కు మీరు ఎందుకు హాజరు కాలేదు అనే సందేహాలపై చాలా అనుమానాలు వస్తున్నాయని వాటి పై మీ స్పందన ఏమిటి అని కూడా అడగడంతో బాలయ్య ప్రత్యేకంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

 జగన్ ను కలవను

జగన్ ను కలవను


జగన్ తో జరిగిన సమావేశానికి చిరు బృందం నుంచి ఇన్విటేషన్ ఇచ్చినట్లుగా నందమూరి బాలకృష్ణ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే ఆ ఇన్విటేషన్ వచ్చినా తాను సమావేశానికి హాజరు కాలేను అని తిరిగి సమాధానం పంపినట్లుగా బాలకృష్ణ తెలిపారు. ఇప్పుడే కాదు తాను ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవని నిర్మొహమాటంగా చెప్పేశారు.

Recommended Video

Tollywood కి తెలంగాణాలో లేని సమస్యలు ఏపీ లో ఎందుకంటే - Comedian Ali Presmeet | Filmibeat Telugu
 టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉన్నా..

టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉన్నా..

ఇక సినిమా టికెట్ల రేట్ల విషయం గురించి మాట్లాడుతూ.. బడ్జెట్ ఎక్కువ అయితేనే టికెట్ల విషయంలో పలు సమస్యలు ఉంటాయని, కానీ తన సినిమాలకు పరిమితికి మించి బడ్జెట్ పెరగనివ్వనని.. కావున టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నా కూడా తనకు తన సినిమాలకు ఏ సమస్య ఉండదు అని అన్నారు. ఇక తక్కువ టికెట్ల రేట్లతోనే అఖండ సినిమా ఘన విజయం సాధించినట్లుగా చెబుతూ.. ఇంతకుమించి మరొక ఉదాహరణ ఏం కావాలి అని బాలయ్య తనదైన శైలిలో తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X