బాలయ్యను ఫ్యాక్షనిస్టు పూనాడా? జర్నలిస్టు పై దాడి... నరికేస్తా, బాంబులేస్తా, ప్రాణాలు తీస్తా అంటూ!

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన ఎన్నికల ప్రచారంలో అదుపుతప్పి ప్రవర్తించాడు. ఓ జర్నలిస్టుపై చేయి చేసుకోవడంతో పాటు చంపేస్తాను, నరికేస్తాను, బాంబులేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

బాలయ్య దుర్భాషలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా ఉండి, ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఆయన ఇలా చేయి చేసుకోవడం, చంపుతాను, నరుకుతాను, బాంబులేస్తాను అంటూ ఫ్యాక్షనిస్టు తరహాలో ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

Recommended Video

Balakrishna Clarification On Media Journalist Issue | Filmibeat Telugu
రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా..

రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా..

‘రాస్కెల్‌ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగుపెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం​ కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు' అంటూ బాలయ్య బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డైయ్యాయి.

అసలు ఏం జరిగింది?

అసలు ఏం జరిగింది?

బాలకృష్ణ వస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు లాగిపడేశారు. దీన్ని షూట్‌ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, బూతులు తిట్టారు. కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలంటూ వాదనకు దిగారు, ఈ క్రమంలోనే అతడిపై చేయి చేసుకున్నట్లు సమాచారం.

బాలయ్యను ఫ్యాక్షనిస్టు పూనాడా?

బాలయ్యను ఫ్యాక్షనిస్టు పూనాడా?

ఫ్యాక్షనిజం నేపథ్యంతో సాగే సినిమాలకు బాలయ్య పెట్టింది పేరు. కత్తులతో నరకడాలు, బాంబులు వేయడాలు లాంటి సీన్లు ఎన్నో చేశారు. అయితే నిజ జీవితంలో అలాంటివి చేయడం నేరం అనే విషయం బాలయ్యకు తెలియాదా? ఆయన్ను ఫ్యాక్షనిస్టు ఏమైనా పూనాడా? అంటూ విమర్శిస్తున్నారు.

సర్వత్రా విమర్శలు

ఇప్పటికే పలు సందర్భాల్లో అభిమానులపై చేయి చేసుకుని అబాసు పాలైన బాలయ్య ... బాధ్యతగా, హుందాగా ఉండాల్సిన ఎన్నికల ప్రచారంలో కడా ఇలా ప్రవర్తిండంపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X