‘అఖండ’తో చరిత్ర సృష్టించిన బాలకృష్ణ: సౌత్‌లోనే రెండో హీరో.. అడుగు దూరంలో కనీవినీ ఎరుగని రికార్డు!

నటసింహా నందమూరి బాలకృష్ణ కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్నారు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' తర్వాత ఆయన ఎన్నో సినిమాలు చేసినా.. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో తనకు రెండు భారీ విజయాలను అందించిన బోయపాటి శ్రీనుతో కలిసి 'అఖండ' అనే సినిమా చేస్తున్నారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ రావడంతో బాలకృష్ణ ఖాతాలో ఎన్నో రికార్డులు చేరాయి. తాజాగా నమోదైన ఫీట్‌తో సౌతిండియాలోనే రెండో హీరోగా నిలిచారాయన. ఆ వివరాలు మీకోసం!

హ్యాట్రిక్ కొట్టేందుకు మళ్లీ జతకట్టిన BB

హ్యాట్రిక్ కొట్టేందుకు మళ్లీ జతకట్టిన BB

'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న చిత్రమే 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్, సామ్నా కాశీం హీరోయిన్లుగా చేస్తుండగా.. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ దీనికి సంగీంతం అందిస్తున్నాడు.

హిట్ కోసం సరికొత్తగా చేస్తున్న బాలయ్య

హిట్ కోసం సరికొత్తగా చేస్తున్న బాలయ్య

వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతోన్న బాలకృష్ణ.. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే 'అఖండ' మూవీ కోసం ఆయన ఎన్నో సాహసాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగులో ఎవరూ చేయని అఘోరా పాత్రను కూడా పోషిస్తున్నారు. అలాగే, కొన్ని రియల్ స్టంట్స్ కూడా స్వయంగా చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

‘అఖండ'గా గర్జన.. దద్దరిల్లిన రికార్డుల

‘అఖండ'గా గర్జన.. దద్దరిల్లిన రికార్డుల

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాకు 'అఖండ' అనే టైటిల్ పెడుతున్నట్లు ఈ ఉగాదికే వెల్లడించారు. ఇందుకోసం ఓ టీజర్‌ను కూడా విడుదల చేశారు. పవర్‌ఫుల్ యాక్షన్‌తో వచ్చిన ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో భారీ స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. తద్వారా దీని పేరిట ఎన్నో రికార్డులు బద్దలైపోతున్నాయి.

తెలుగులో ఏకైక హీరోగా ఘనత సొంతం

తెలుగులో ఏకైక హీరోగా ఘనత సొంతం

'అఖండ' టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా యూట్యూబ్‌లో ఇది దండయాత్ర చేస్తోంది. ఫలితంగా ఆరు రోజుల్లో 25 మిలియన్ పైచిలుకు వ్యూస్‌ను అందుకుందీ టీజర్. దీంతో RRR, ఆచార్య సహా ఎన్నో సినిమాల టీజర్లు వెనక్కు వెళ్లిపోయాయి. అదే సమయంలో ఈ రేంజ్ స్పందనను అందుకున్న ఏకైక తెలుగు సీనియర్ హీరోగా బాలయ్య రికార్డు క్రియేట్ చేశాడు.

‘అఖండ'తో చరిత్ర సృష్టించిన బాలకృష్ణ

‘అఖండ'తో చరిత్ర సృష్టించిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ 'అఖండ' టీజర్ ఇప్పటికే 30 మిలియన్ మార్కును కూడా దాటేసింది. ఇక, తాజాగా ఇది 33 మిలియన్ మార్కును కూడా చేరుకుంది. దీంతో రజినీకాంత్ నటించిన 'కాలా' సినిమా రికార్డు (32 మిలియన్ వ్యూస్)ను బద్దలు కొట్టేసింది. ఫలితంగా దక్షిణాదిలోనే ఎక్కువ వ్యూస్ సాధించిన సీనియర్ హీరోల జాబితాలో నటసింహం రెండో స్థానానికి చేరుకున్నారు.

Recommended Video

Akhanda Movie తో మరో స్టార్ హీరో కి లైఫ్ ఇవ్వబోతున్న బాలయ్య బాబు!! || Filmibeat Telugu
సౌత్‌లోనే రెండో హీరో.. మరో రికార్డుకు

సౌత్‌లోనే రెండో హీరో.. మరో రికార్డుకు

సీనియర్ హీరోల జాబితాలో ఎక్కువ వ్యూస్ అందుకున్న చిత్రాల్లో రజినీకాంత్ నటించిన 'కబాలీ' 37 మిలియన్ వ్యూస్‌తో ప్రథమ స్థానంలో ఉంది. దీని తర్వాత బాలయ్య 'అఖండ' జెట్ స్పీడుతో దూసుకుపోతోంది. ఈ టీజర్ రెస్పాన్స్ చూస్తుంటే ఆ రికార్డు కూడా మరో రెండు రోజుల్లో బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. అదే జరిగితే సౌత్‌లోనే నెంబర్ వన్ హీరోగా నిలుస్తాడు నందమూరి బాలయ్య.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X