twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR రికార్డును బద్దలు కొట్టిన ‘అఖండ’: బాలయ్య ధాటికి అతలాకుతలం.. కేవలం 24 గంటల్లో అవన్నీ మటాష్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లకు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపు ఆదరణ లభిస్తుంటుంది. అందులో నటసింహా నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను జోడీ ఒకటి. వీళ్ల కలయికనే ప్రత్యేకంగా చెప్పుకోడానికి కారణం.. గతంలో వీళ్లిద్దరూ కలిసి చేసిన 'సింహా', 'లెజెండ్' చిత్రాలు ఘన విజయాన్ని అందుకోవడమే. ఇప్పుడీ కాంబోలో వస్తున్న చిత్రమే 'అఖండ'. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ వీడియో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఈ క్రమంలోనే RRR కూడా కనుమరుగైంది. ఆ వివరాలు మీకోసం!

    బాలయ్యకు మూడు.. బోయపాటి కూడా

    బాలయ్యకు మూడు.. బోయపాటి కూడా

    జయాపజయాలను పట్టించుకోకుండా సినిమాలు చేయడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అంతలా ఆయన వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2019లో ఏకంగా మూడు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అవన్నీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడ్డాయి. అలాగే, డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా 'వినయ విధేయ రామ'తో భారీ డిజాస్టర్‌ను మూటగట్టుకున్నాడు.

    మూడో సారి కలిశారు.. ‘అఖండ' అంటూ

    మూడో సారి కలిశారు.. ‘అఖండ' అంటూ

    నందమూరి బాలకృష్ణ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నారు. అదే సమయంలో 'వినయ విధేయ రామ' వంటి ఫ్లాప్ మూవీతో వెనకడుగు వేశాడు బోయపాటి శ్రీను. సరైన హిట్ కోసం వేచి చూస్తున్న ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. 'అఖండ' అనే సరికొత్త టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

    టాలీవుడ్‌లోనే తొలిసారి.. అలాంటి పాత్రలో

    టాలీవుడ్‌లోనే తొలిసారి.. అలాంటి పాత్రలో

    'సింహా', 'లెజెండ్' వంటి రెండు భారీ విజయాల తర్వాత రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ మూవీని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. అంతేకాదు, ఇందులో బాలయ్య రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి అఘోరా పాత్ర కూడా ఉంది. గతంలో తెలుగులో ఏ హీరో కూడా ఇలాంటి పాత్రను పోషించలేదు.

     ఉగాదికి రివీల్ చేశారు.. టీజర్ అదిరిందిగా

    ఉగాదికి రివీల్ చేశారు.. టీజర్ అదిరిందిగా

    వాస్తవానికి బోయపాటి - బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు BB3 అనే వర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. ఈ క్రమంలోనే మూవీ కోసం 'మోనార్క్', 'సూపర్‌మ్యాన్', 'ధర్మ', 'గాడ్ ఫాదర్' వంటి ఎన్నో టైటిళ్లను పరిశీలించారు. కానీ, చివరకు 'అఖండ' అనే పేరును పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఉగాదికి వదిలారు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది.

    ఒక్క రోజులోనే అన్ని లక్షల వ్యూస్‌తో సత్తా

    ఒక్క రోజులోనే అన్ని లక్షల వ్యూస్‌తో సత్తా

    'అఖండ' టీజర్‌‌లో బాలయ్య అఘోరా లుక్.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. బోయపాటి మార్క్ పవర్ ఫుల్ డైలాగ్ అదిరిపోయాయి. అందుకే దీనికి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 11 మిలియన్ పైచిలుకు వ్యూస్‌ను రాబట్టింది. ఫలితంగా ఒక రోజులోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

    Recommended Video

    #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
    RRR రికార్డును బద్దలు కొట్టిన ‘అఖండ'

    RRR రికార్డును బద్దలు కొట్టిన ‘అఖండ'

    కొన్ని నెలల క్రితం వచ్చి RRR మోషన్ పోస్టర్ వీడియోకు నాలుగు వారాల్లో 7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే, ఆ తర్వాత వచ్చిన 'భీమ్ ఫర్ రామరాజు' టీజర్‌కు నాలుగు వారాల్లో 12 మిలియన్ వ్యూస్ దక్కాయి. అయితే, బాలయ్య 'అఖండ' టీజర్‌కు మాత్రం కేవలం 25 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో BB3 దెబ్బకు RRR రికార్డులు కనుమరుగయ్యాయి.

    English summary
    Nandamuri Balakrishna’s upcoming project with Boyapati Srinu. Popular referred to as ‘BB3’, the high-octane actioner will be hitting the worldwide theaters on May 28th, 2021, and clashing with Ravi Teja’s Khiladi at the box-office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X