Akhanda Twitter Review: సింహా, లెజెండ్ తరహాలో ఊహించుకోవద్దు.. అఖండ సినిమా ఎలా ఉందంటే?
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాకేజ్ సంబంధించిన ప్రీమియర్ షోలు మొదటిరోజు తెల్లవారుజామున మొదలయ్యాయి. ఫ్యాన్స్ షోలతో థియేటర్స్ దద్దరిల్లినట్లు అనిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి మాస్ ఆడియెన్స్ రచ్చ మామూలుగా లేదు. ఇక ఫైనల్ గా సినిమా చూసిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ వారి స్టైల్ లో రివ్యూలు ఇచ్చేస్తున్నారు.

హ్యాట్రిక్ కాంబినేషన్
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి. సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మొత్తానికి మూడవసారి కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకునేందుకు స్ట్రాంగ్ గా సిద్ధమయ్యారు. అఖండ సినిమా నేడు ప్రేక్షకులకు వస్తోంది.

చాలా రోజుకు తరువాత
ఇక నందమూరి హార్డ్ కోర్ ఫ్యాన్స్ స్పెషల్ ప్రీమియర్ షోలను చూసేందుకు ఎంతగానో ఆసక్తి చూపించారు. చాలా రోజుల అనంతరం బాలయ్య సినిమా వెండితెరపైకి వస్తుండడంతో అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకున్నారు తప్పకుండా సినిమా అంతకు మించి అనేలా ఉంటుంది అని నమ్మకంతో జన్నారు. దర్శకుడు బోయపాటి కూడా అభిమానులకు నచ్చే విదంగానే సినిమాను చూసినట్లు విజువల్స్ చూస్తేనే అర్ధమవుతుంది.

అఘోరా పాత్ర అద్భుతం
ఇక అఖండ సినిమాను చూసిన అభిమానులు ట్విట్టర్ ద్వారా వారి స్పందనను అందిస్తున్నారు. బాలకృష్ణ ఎంట్రీతో పాటు ఇంటర్వెల్ సీన్ హైలెట్ అంటున్నారు. అలాగే పోలీస్ స్టేషన్ ఫైట్ క్లైమాక్స్ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయట. అయితే అఘోరా పాత్రలో బాలయ్య కంటే ఎవరూ కూడా అంతగా సెట్టవ్వరు అంటూ థమన్ కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుందని అందరూ అనుకున్నారు.

అదే లెవెల్లో యాక్షన్ సీక్వెన్స్
గతంలో సింహా, లెజెండ్ సినిమాల్లో బాలకృష్ణ స్థాయికి తగ్గట్టుగానే బోయపాటి శ్రీను యాక్షన్ ఎపిసోడ్స్ తో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక ఈసారి కూడా అదే లెవెల్లో యాక్షన్ సీక్వెన్స్ తో మెప్పించినట్లు అర్ధమవుతోంది. అఖండ మాస్ జాతర అంటూ అభిమానులు థియేటర్స్ లో విజిల్స్ వేస్తున్నారు.

అక్కడ కొంచెం బోగోలేదట..
అఖండ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా అంతగా బాగోలేకపోయినప్పటికి చివరలో మంచి ఎంటర్టైనర్ అంటూ కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇంటర్వెల్ లో అఘోరా ఎంట్రీ మరొక లెవెల్ లో ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక థమన్ మ్యూజిక్ అదరగొట్టేసాడు అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

పూనకాలు రాకపోతే నన్ను అడగండి
బి అండ్ సి సెంటర్స్ లో పూనకాలు రాకపోతే నన్ను అడగండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ డికేడ్ కి బాలయ్య చాలు, తప్పకుండా చాలాసార్లు సినిమాను చూస్తారు. జై బాలయ్య అంటూ మరికొందరు అభిమానులు పాజిటివ్ గా రివ్యూలు అందిస్తున్నారు. ప్రస్తుతం సోషక్ మీడియాలో జై బాలయ్య ట్యాగ్ కూడా గట్టిగానే వైరల్ అవుతోంది.

అఖండ మాస్ జాతర
ఇంటర్వెల్ చాలా అద్భుతంగా వచ్చిందని చాలామంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అఖండ మాస్ జాతర ఇంటర్వెల్ లో మాస్ ఆడియెన్స్ కు బాగా నచ్చుతుందని అర్ధమవుతోంది. ఇక బోయపాటి శ్రీను - బాలయ్య మాస్ కాంబినేషన్ కు పర్ఫెక్ట్ ఉదాహరణ అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Recommended Video

అదే మేజర్ ప్లస్ పాయింట్
ఇక ఓ వర్గం అభిమానులు మాత్రం సింహా లెజెండ్ తరహాలో ఉహించుకోవద్దు అంటూ అఖండ డిఫరెంట్ మాస్ బొమ్మ అంటున్నారు.బాలయ్య నటనతో బీభత్సం సృష్టించడాని బోయపాటి చాలా విబిన్నంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్లు చెబుతున్నారు ఇక సినిమాకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటూ మంచి సినిమాను ఇచ్చినందుకి ద్వారాక క్రియేషన్స్ కు కూడా అభిమనులు కృతజ్ఞతలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











