Akhanda pre release event live: సింహంలా అడుగుపెట్టిన బాలకృష్ణ.. బోయపాటి రాయల్‌గా ఎంట్రీ
నట సింహం, బాక్సాఫీస్ బొనాంజా బాలకృష్ణ నటించిన అఖండ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా మొదలైంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ నిర్మాత మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వేడుకకు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఈ సినిమా విశేషాలను, ముఖ్యుల ప్రసంగాలను ఓసారి చూసొద్దామా?
అఖండ సినిమా వేడుక జరిగే శిల్ప కళావేదిక వద్ద రెండు గంటల ముందే కిటకిటలాడిపోయింది. రాజమౌళిని ఆరాధించే ప్రేక్షకులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్, నందమూరి అభిమానులు భారీగా పోటెత్తడంతో హాల్ నిండిపోయింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చాలా మంది అభిమానులు లోపలికి వెళ్లలేక బయటనే ఉండిపోయారు.
ఇక యాంకర్ మాటలు, కళాకారుల ఆటపాటలతో కొనసాగుతున్న వేదిక ప్రాంతంలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను అట్టహాసంగా అడుగుపెట్టారు. బాలయ్య రాకతో అభిమానులు పులకించిపోయారు. బాలకృష్ణ కనిపించగానే అభిమానుల అరుపులు, ఈలలతో హోరెత్తించారు.

ఇండస్ట్రీకి బాలయ్య శివుడు లాంటి వాళ్లు
అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అర్జున్‌కు థ్యాంక్స్. ఈ సినిమాకు రెండేళ్లుగా పనిచేయడంతో ఒక శివుడుతో ప్రయాణం చేసినట్టు ఉంది. ఇండస్ట్రీకి బాలకృష్ణ శివుడు లాంటి వారు. బాలకృష్ణ ట్రాన్స్‌ఫార్మర్ అయితే బోయపాటి మంచి ఓల్టేజ్ ఇచ్చే ఏకైక డైరెక్టర్ బోయపాటి. జై బాలయ్య సినిమాలో వేసిన స్టెప్పులు కేక. బోయపాటికి ఎక్కడ ఉప్పు వేయాలి? ఎక్కడ కారం వేయాలి అనే విషయం తెలుసు. సినిమాలో 70 సీన్లు ఉంటే.. 50 సీన్లు లేచి నిలబడే ప్రేక్షకుల ఎంజాయ్ చేస్తారు అని తమన్ అన్నారు.

బాలయ్య.. ఎనర్జీ ఏమిటి సార్?
బాలకృష్ణను ఉద్దేశించి ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. సార్.. బాలయ్య గారు.. మీ ఎనర్జీ సీక్రెట్ కూడా చెప్పాలి. ఆ డ్యాన్సులు ఏంటి సార్.. ఆ ఎనర్జీ ఏంటి సార్. మనం చూసింది మచ్చుతునక మాత్రమే. సినిమాలో అఖండ ఎంట్రీ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లలో చూస్తున్నా. అఖండ అద్భుతమైన విజయం సాధించాలి. ఇండస్ట్రీకి ఒక ఊపు తీసుకురావాలి అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.

డిసెంబర్ 2న దబిడి దిబిడే.. శ్రీకాంత్
బాలయ్య బాబు అభిమానులకు నా అభినందనలు. ఈ ఎనర్జీ చూస్తే డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో దబిడి దిబిడే. బాలయ్య బాబుతో నాకు ఇది రెండో సినిమా. శ్రీరామరాజ్యంలో లక్ష్మణుడుగా నటించాను. ఇప్పుడు అఖండలో సినిమాలో రావణాసురుడిగా నటిస్తున్నాను. ఇది నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా సాఫ్ట్‌గా కనిపిస్తాను. నాలో ఏం చూశాడో బోయపాటి.. నన్ను విలన్ చేశాడు. బాలయ్య అంటే పవర్‌ఫుల్ డైలాగ్స్‌కు పెట్టింది పేరు. నాకు మేకప్ చేసిన తర్వాత గెటప్ చూసి నాకు నేనే నమ్మలేకపోయాను. ఆ గెటప్ కోసం బోయపాటి బాగా కష్టపడ్డాడు. తొలి రోజే బాలయ్యతో కాంబినేషన్ సీన్స్ పడ్డాయి. వరదరాజుల క్యారెక్టర్‌లో ఒదిగిపోయాను. బాలకృష్ణ ఎనర్జీ మామూలుగా ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఎనర్జీ ఉంటుంది. మీ మాదిరిగానే థియేటర్లలో ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వేచి చూస్తున్నా అని శ్రీకాంత్ అన్నారు. తెరపైన కొత్త పాత్రలో శ్రీకాంత్ ఎలా ఉంటాడో వేచి చూడాల్సిందే. ఇలాంటి సినిమాకు రూపొందించిన నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి థ్యాంక్స్ అని శ్రీకాంత్ అన్నారు.

బాలయ్య నా గాడ్ ఫాదర్.. అంటూ పూర్ణ
ఆర్టిస్టుగా ఎంతో మందితో నటించాను. నేను మలయాళ నటిని. కానీ తెలుగు సినిమా పరిశ్రమ నన్ను ప్రోత్సాహించింది. ఈ సినిమాలో అవకాశం నిర్మాత, దర్శకలుకు, యూనిట్‌కు ధన్యవాదాలు. ఇక శ్రీకాంత్ గారిని చూస్తే నిజంగా భయం వేసింది. ఇక సింహం బాలయ్య విషయానికి వస్తే.. సార్ నేను కేరళ నుంచి వచ్చాను. బాలయ్య ఎనర్జీని ఎవరిలో చూడలేదు. ఇంతవరకు నేను అంత మంచి మనసు ఉన్న బాలయ్య లాంటి వ్యక్తిని చూడలేదు. ఆయన నాకు రోల్ మోడల్ కాదు. నా గాడ్‌ఫాదర్. చాక్లెట్ బాయ్ బన్నీకి ముఖ్యంగా థ్యాంక్స్. తెలుగు సినిమాలను మలయాళ రంగానికి పరిచయం చేసిన వ్యక్తి అల్లు అర్జున్. ఆర్య సినిమా తర్వాత అందరూ ఆయన ఫోటోను పర్సులోపెట్టుకొనే వారు అని పూర్ణ అన్నారు.


Click it and Unblock the Notifications











