సంచలనం సృష్టించిన బాలకృష్ణ: ‘అఖండ’తో కనీవినీ ఎరుగని రికార్డు.. సౌతిండియాలోనే ఏకైక హీరోగా ఘనత

తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు వస్తుంటాయి. కానీ, వాటిలో కొన్ని మాత్రమే విడుదల ముందు నుంచే భారీ స్థాయిలో ఆసక్తిని ఏర్పరుస్తుంటాయి. అదే సమయంలో రిలీజ్‌కు ముందే రికార్డులను క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి చిత్రాల్లో 'అఖండ' ఒకటి. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా కనీవినీ ఎరుగని రికార్డును క్రియేట్ చేసింది. దీంతో నందమూరి బాలకృష్ణ సంచలనం సృష్టించారు. తద్వారా సౌతిండియాలోనే ఏకైక హీరోగా ఘనతను అందుకున్నారు. ఆ వివరాలు మీకోసం!

సింహా... లెజెండ్... ఇప్పుడు ‘అఖండ'

సింహా... లెజెండ్... ఇప్పుడు ‘అఖండ'

'సింహా', 'లెజెండ్' వంటి భారీ హిట్ చిత్రాల తర్వాత నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'అఖండ'. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లు. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు.

టైటిల్ రోర్ అంటూ గర్జించిన బాలయ్య

టైటిల్ రోర్ అంటూ గర్జించిన బాలయ్య

ఈ సినిమాకు మొన్నటి వరకూ టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఈ క్రమంలోనే ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం టైటిల్‌ను రివీల్ చేశారు. దీనికి 'అఖండ' అనే పేరును పెడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టైటిల్ రోర్ అనే పేరిట ఓ వీడియోను సైతం విడుదల చేశారు. అందులో బాలయ్య అఘోరా పాత్రతో గర్జించారు.

24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్

24 గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూస్

'అఖండ' టీజర్‌‌లో బాలయ్య అఘోరా లుక్.. థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్.. బోయపాటి మార్క్ పవర్ ఫుల్ డైలాగ్ అదిరిపోయాయి. అందుకే దీనికి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ 24 గంటల్లోనే 11 మిలియన్ పైచిలుకు వ్యూస్‌ను రాబట్టింది. ఫలితంగా ఒక రోజులోనే అత్యధిక వ్యూస్ సాధించిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

తెలుగు హీరోల రికార్డులు బద్దలు కొట్టి

తెలుగు హీరోల రికార్డులు బద్దలు కొట్టి

'అఖండ' టీజర్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. RRR మోషన్ పోస్టర్ వీడియోకు నాలుగు వారాల్లో 7 మిలియన్ వ్యూస్, ఆ తర్వాత వచ్చిన 'భీమ్ ఫర్ రామరాజు' టీజర్‌కు నెలలో 12 మిలియన్ వ్యూస్ దక్కాయి. అయితే, బాలయ్య 'అఖండ' టీజర్‌కు మాత్రం కేవలం 25 గంటల్లోనే 12 మిలియన్ వ్యూస్ సొంతమయ్యాయి. అలాగే, తెలుగు సీనియర్ హీరోల రికార్డులు బ్రేకయ్యాయి.

నటసింహం ఖాతాలో అరుదైన రికార్డు

నటసింహం ఖాతాలో అరుదైన రికార్డు

తెలుగులోని సీనియర్ హీరోల టీజర్లకు వచ్చిన వ్యూస్ విషయంలో.. 'అఖండ'తో బాలయ్య కేవలం ఆరు రోజుల్లోనే నెంబర్ వన్ స్థానాన్ని అందుకున్నారు. అనంతరం దక్షిణాది మీద ఆయన దండయాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగానే రజినీకాంత్ నటించిన 'కాలా' రికార్డును రెండు రోజుల క్రితం బద్దలు కొట్టి.. సౌతిండియాలో రెండో స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటారు.

సౌతిండియాలోనే ఏకైక హీరోగా ఘనత

సౌతిండియాలోనే ఏకైక హీరోగా ఘనత

తాజాగా 'అఖండ' టీజర్ 38 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. తద్వారా సీనియర్ హీరోల జాబితాలో ఎక్కువ వ్యూస్ అందుకున్న మొదటి చిత్రంగా సంచలనం సృష్టించింది. దీని కంటే ముందు రజినీకాంత్ నటించిన 'కబాలీ' 37 మిలియన్ వ్యూస్‌తో ప్రథమ స్థానంలో ఉండేది. ఇప్పుడది బ్రేక్ అయిపోయింది. దీంతో బాలయ్య సౌతిండియాలో నెంబర్ వన్ హీరోగా నిలిచారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X