NBK 109: హై రేంజ్‌ యాక్షన్‌తో బాలయ్య మూవీ.. కొత్త పోస్టర్‌తో బిగ్ సర్‌ప్రైజ్

NBK 109: ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ రెట్టంచిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నటిసింహా నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna). ఇటీవలే వచ్చిన 'భగవంత్ కేసరి' చిత్రంతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్న ఆయన.. ఫ్యూచర్ ప్రాజెక్టులను మరింత జోష్‌తో మొదలు పెట్టేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే తన 109వ సినిమాను కూడా అనౌన్స్ చేశారు. దీన్ని కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే.

వరుస హిట్లతో మాంచి జోరు మీదున్న నందమూరి బాలకృష్ణ - బాబీ (Bobby) కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై ప్రకటన సమయం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ మూవీ కాన్సెప్టు పోస్టర్‌ను డిజైన్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. ఇందులో కొన్ని ఆయుధాలను చూపించడంతో పాటు సినిమా నేపథ్యంపైన కూడా క్లారిటీ ఇచ్చేశారు. అప్పటి నుంచి ఈ చిత్రంపై హైప్ క్రమంగా పెరుగుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించారు.

Nandamuri Balakrishna and Bobby Movie Shooting Started With Action Part

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా మొదలు పెట్టింది. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'లైట్స్ కెమెరా యాక్షన్.. బ్లడ్ బాత్‌కు బ్రాండ్ నేమ్.. హింసకు విజిటింగ్ కార్డ్ నటసింహా నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న NBK 109 షూటింగ్ నేటి నుంచి ప్రారంభం అవుతుంది' అంటూ పేర్కొన్నారు.

Nandamuri Balakrishna and Bobby Movie Shooting Started With Action Part

నందమూరి బాలకృష్ణ - బాబీ సినిమా షూటింగ్ అప్‌డేట్‌తో పాటు ఓ విభిన్నమైన పోస్టర్‌ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ఓ గొడ్డలి.. దానికి గ్లాసెస్ పెట్టారు. అందులో నుంచి కొన్ని రూపాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ పోస్టర్‌తో ఇప్పటి వరకూ ఉన్న అంచనాలు అన్నీ రెట్టింపు అయిపోయాయి. ఇక, ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X