Taraka Ratna పెద్ద కర్మలో Jr NTR ను దూరం పెట్టిన బాలయ్య.. వీడియోలు వైరల్.. వాళ్ళు ఏమంటున్నారంటే?

నందమూరి తారకరత్న కుటుంబంలో ఇటీవల చోటు చేసుకున్న విషాదం అందరిని ఎంతగానో షాక్ కు గురి చేసింది. ఇక ఇటీవల తారకరత్న పెద్దకర్మ నిర్వహించిన విషయం తెలిసిందే ఇక అందులో నందమూరి కుటుంబ సభ్యులు చాలామంది పాల్గొన్నారు. అయితే ఆ పెద్దకర్మకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టినట్లుగా కూడా అనిపిస్తోంది అని కామెంట్స్ వస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే..

 నమ్మశక్యంగా లేదు

నమ్మశక్యంగా లేదు


చిన్న వయసులోనే తారకరత్న అలా హఠాత్తుగా మృతి చెందడం ఇంకా నమ్మశక్యంగా లేదు అని చాలామంది సన్నిహితులు అభిమానులు కూడా భావోద్వేగానికి గురి అవుతున్నారు. ఇక ఆయన మరణించిన మూడు రోజులకే 40 పుట్టినరోజు కావడం ఇక ఆ తర్వాత వెంటనే పెద్దకర్మ కూడా జరిగిపోవడం ఇదంతా నమ్మడానికి వీలుగా లేదు అని ఆయన భార్య అలేఖ్య రెడ్డి కూడా ఎంతో బాధతో సోషల్ మీడియాలో ఒక వివరణ కూడా ఇచ్చారు.

పెద్దకర్మ కార్యక్రమంలో..

పెద్దకర్మ కార్యక్రమంలో..

ఇక చాలామంది కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్దకర్మలో అలేఖ్య రెడ్డిని ఓదార్చారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించారు. అయితే ఈ కార్యక్రమంలో నందమూరి కుటుంబ సభ్యులు దాదాపు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా నందమూరి హీరోలు బాలకృష్ణ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞ తేజ ఇలా నందమూరి వారసులు పెద్దకర్మలో కనిపించారు.

రాజకీయ నాయకులు కూడా..

రాజకీయ నాయకులు కూడా..

ఇక ప్రముఖ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు అలాగే మరి కొంతమంది టిడిపి ప్రముఖ నేతలు కూడా ఆ కార్యక్రమంలో హాజరయ్యారు. ఇక వైసిపి ప్రముఖ నేత విజయసాయిరెడ్డి కూడా తన బంధువైన తారకరత్నకు నివాళులర్పించారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి ఇలా మరికొందరు ప్రముఖ కుటుంబ సభ్యులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని తారకరత్న భార్య బిడ్డలను పరామర్శించారు.

ఎన్టీఆర్ ను పలకరించకుండా..

ఎన్టీఆర్ ను పలకరించకుండా..

అయితే అంతా సాఫీగా కొనసాగుతున్న సమయంలో పెద్దకర్మ కు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఊహించిన విధంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొన్ని వీడియోలలో జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న ఒక దగ్గర కూర్చుని ఉండగా బాలకృష్ణ అందరినీ పలకరించి జూనియర్ ఎన్టీఆర్ ను మాత్రం పలకరించకుండా కనిపించినట్లుగా కామెంట్స్ అయితే వస్తున్నాయి.

బాలయ్య అలా చేయడం..

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పెద్దకర్మ కార్యక్రమంలో తారకరత్న ఫోటోకు నివాళులర్పిస్తూ ఉండగా బాలకృష్ణ అప్పుడే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నట్లు కనిపించారు. అంతకు ముందు వచ్చిన కళ్యాణ్ రామ్ ను కూడా ఆయన చూసి సైగ చేసినట్లుగా కనిపించారు. కానీ ఎన్టీఆర్ వచ్చినప్పుడు మాత్రం బాలయ్య బాబు పక్కన ఎవరితో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఉండడంతో సోషల్ మీడియాలో ఆ వీడియోలు మరింత వైరల్ అయ్యాయి.

బాలయ్య దూరం పెట్టలేదు

నందమూరి ఫ్యామిలీకి క్లోజ్ గా ఉండే ఫ్యాన్స్ మాత్రం వీడియోలపై మాత్రం తప్పుపడుతున్నారు. క్లోజ్ గా గమనిస్తే ఒక వీడియోలో బాలకృష్ణ వచ్చినప్పుడు ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లేచి నిలబడ్డారు. అయితే పర్వాలేదు కూర్చోండి అని బాలయ్య చేతితో సైగ చేసినట్లుగా కూడా మరొక వీడియోలో కనిపిస్తోంది.

ఇలాంటి సమయంలో కరెక్ట్ కాదు

బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ దగ్గరికి వచ్చి పలకరించారు అని చెబుతున్నారు. అయినా దగ్గరి కుటుంబ సభ్యులు రోజు మాట్లాడుకునేదే అని ఇలా అనవసరంగా కొన్ని వీడియోలతో వారి బంధుత్వంలో విభేదాలు ఉన్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు అని, ముఖ్యంగా ఇలాంటి సమయంలో ఇది కరెక్ట్ కాదని కూడా మరికొందరు ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X