NBK 108: మరో బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన భగవంత్ కేసరి.. స్పెషల్ గా రాబోతున్న టీజర్!
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య బాబు నెవర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నాడు. ఇది ఆయనకు 108వ సినిమా. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని ఇప్పటికే చిత్ర యూనిట్ చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మొదటిసారి బాలయ్య బాబుతో సినిమా చేస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు గట్టిగానే పెరుగుతున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు కూడా మంచి స్పందన లభించింది. ఇక మొత్తానికి టైటిల్ కూడా ఫైనల్ చేశారు. ఈ సినిమాకు కథకు తగ్గట్టుగా ఉండే విధంగా భగవంత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గత కొన్ని రోజులుగా అనేక రకాల టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

ఇక మొత్తానికి ఈరోజు నిర్మాణ సంస్థ అధికారికంగా టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా టీజర్ కూడా ఎప్పుడు విడుదల చేస్తారా అని ఆసక్తిగా ఉన్న సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి అద్భుతమైన అప్డేట్ అయితే ఇచ్చాడు.
ఇక ఈ సినిమా బాలయ్య బాబుకు 108వ సినిమా కాబట్టి అందుకు మ్యాచ్ అయ్యే విధంగా ఉండేలా ప్రపంచవ్యాప్తంగా 108 థియేటర్లలో ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ రెడీ చేసుకుంది. ఈనెల 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 108 థియేటర్లలోనే సినిమా టీజర్ చూసే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఫ్యాన్స్ కు ఇది ఒక అద్భుతమైన అప్డేట్ అని చెప్పవచ్చు.
వరుస విజయాలతో బాలయ్య బాబు రేంజ్ కూడా అంతకంతకు పెరుగుతోంది. ఇక ఇప్పుడు మాస్ కమర్షియల్ దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా కాబట్టి ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కావడం పక్క అని నందమూరి ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేయాలని నిర్మాణ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది.


Click it and Unblock the Notifications











