Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్‌తో నాయిస్ స్మార్ట్‌వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్‌తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అభిమానిని కొట్టిన బాలయ్య: అందుకే నాపై కోపం.. ప్రచారంలో నన్ను మాత్రమేనంటూ బాధితుడి సంచలన వ్యాఖ్యలు
దిగ్గజ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయారు నటసింహా నందమూరి బాలకృష్ణ. సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో అవార్డులు, పురస్కారాలను, మైలురాళ్లను చేరుకున్నారాయన. ఈ క్రమంలోనే కొన్ని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన పేరు మీద ఉన్నన్ని అభిమాన సంఘాలు మరే హీరోకూ లేవు. అలాంటిది తాజాగా బాలయ్య ఓ అభిమానిని కొట్టారు. దీంతో సదరు బాధితుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
భర్తతో శృంగార భంగిమల్లో బీచిలో ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)
వరుస పరాజయాలు.. మరింత దూకుడు
టాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో బాలకృష్ణ అంత వేగంగా సినిమాలు చేసే హీరో మరొకరు లేరు అనేంతగా దూకుడు ప్రదర్శిస్తుంటారాయన. ఏడాది కనీసం రెండు సినిమాలనైనా తీసే నటసింహా 2019లో ఆయన ఏకంగా మూడు చిత్రాలతో నటించగా, అవన్నీ బాక్సాఫీస్ ముందు దారుణమైన పరాజయాలను చవి చూశాయి. అయినప్పటికీ ఆయన వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతున్నారు.
హిట్ కోసం ఆయనతో... హ్యాట్రిక్ కొడతారా
కొంత కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న బాలకృష్ణ.. ఈ సారి ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం తనకు గతంలో 'సింహా', 'లెజెండ్' వంటి భారీ హిట్లను అందించిన బోయపాటి శ్రీనుతో మరోసారి జతకట్టారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
తొలిసారి అలాంటి పాత్ర.... అన్నీ ఎక్కువే
ఇటీవలి కాలంలో బాలయ్యకు సరైన విజయం దక్కకున్నా.. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక, ఈ సినిమా కోసం ఆయన సరికొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నారు. అలాగే, ఇందులో కెరీర్లోనే తొలిసారి అఘోరా పాత్రలోనూ కనిపించబోతున్నారు. వీటితో పాటు ఈ మూవీతో హిట్ కొట్టాలన్న లక్ష్యంతో ఎన్నో సాహసాలు చేస్తున్నారు. దీంతో దీనిపై అంచనాలు పెరిగాయి.
‘క్రాక్' పుట్టించేందుకు సిద్ధమైన బాలయ్య
బోయపాటి శ్రీనుతో చేస్తున్న సినిమా పట్టాలపై ఉండగానే.. 'క్రాక్'తో భారీ విజయాన్ని అందుకున్న ఎనర్జిటిక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నందమూరి బాలకృష్ణ ఓ సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిందని తెలుస్తోంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
అభిమానిపై చేయి చేసుకున్న నటసింహా
అనంతపురం
జిల్లా
హిందూపురం
శాసన
సభ్యుడైన
బాలకృష్ణ
సినిమాలతో
బిజీగా
ఉన్నప్పటికీ
తరచూ
పార్టీ
కార్యక్రమాలకూ
హాజరవుతూ
ఉంటారు.
ఇందులో
భాగంగానే
తన
నియోజకవర్గంలో
జరగనున్న
మున్సిపల్
ఎన్నికల
కోసం
ఆయన
పార్టీ
తరపున
ప్రచారం
నిర్వహిస్తున్నారు.
ఈ
క్రమంలోనే
శనివారం
ఓ
అభిమానిపై
ఈ
నందమూరి
హీరో
చేయి
చేసుకోవడం
సంచలనం
అయింది.
బాధితుడి షాకింగ్ రియాక్షన్.. వీడియోతో
అభిమానిని బాలయ్య కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అన్ని మీడియా సంస్థల్లోనూ ఇది హాట్ టాపిక్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సదరు బాధితుడు ఘటనపై వివరణ ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో ఎన్నో షాకింగ్ విషయాలను చెప్పాడు. అంతేకాదు, బాలయ్య కొట్టడం వల్ల తనకు సంతోషంగా ఉందంటూ రియాక్ట్ అయ్యాడు.
అందుకే నాపై కోపం.. నన్ను మాత్రమేనంటూ
ఆ
వీడియోలో
'మేము
టీడీపీ
కార్యకర్తలం.
బాలయ్య
బాబు
అభిమానులం.
ఉదయం
నుంచి
అలసిపోయి
ఉన్న
ఆయన..
నన్ను
వీడియో
తీయొద్దని
చెప్పారు.
అయినా
నేను
తీస్తుంటే
వచ్చి
కొట్టారు.
ప్రచారం
మొత్తంలో
కరోనా
భయంతో
ఎవరినీ
టచ్
చేయని
బాలయ్య..
నన్ను
ముట్టుకోవడం
సంతోషంగా,
గర్వంగా
ఉంది.
దీనిపై
నాకు
ఏమాత్రం
బాధ
లేదు'
అంటూ
చెప్పాడు
ఆ
కుర్రాడు.