నా కొడుకు నామకరణం జరిగిందిక్కడే.. మోక్షజ్ఞ తేజ్ గురించి బాలకృష్ణ భావోద్వేగం
నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌ను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. తారకరామ సినిమా థియేటర్ రీ ఓపెనింగ్ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరయ్యారు. థియేటర్ వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. పూజలు చేసిన తర్వాత థియేటర్‌లో కూర్చొని వీరసింహారెడ్డి ట్రైలర్ వీక్షించాడు. ఆ తర్వాత గౌతమీ పుత్ర శాతకర్ణిలోని కొన్ని సీన్లను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ..
సినిమాలకు ప్రేక్షకులు రావడం లేదనడం చాలా తప్పు. ఏషియన్ ఫిలింస్ అధినేత నారాయణదాస్ నారంగ్ ఓ మంచి మాట చెప్పారు. టికెట్ రేట్లు అందరికి అందుబాటులో ఉండాలని నారాయణదాస్ చెప్పారు. తెలుగులో మంచి సినిమాలు వస్తున్నాయి. ఓటీటీ కాంప్టిషన్ కారణంగా సినిమా పరిశ్రమకు ఎంత మంది వస్తున్నారనే ప్రశ్న వెంటాడుతున్నది. ఈ పరిస్థితుల్లో సినిమా ఎలా తీయాలి. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలి అనేది సినీ పరిశ్రమ ఆలోచిస్తున్నది. ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మన చిత్ర పరిశ్రమ పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. అందంతా కళామతల్లి, నాన్నగారి ఆశీస్సులతోనే జరిగింది అని బాలకృష్ణ చెప్పారు.

తారకరామ థియేటర్‌లో నా కుమారుడు మోక్షజ్ఝకు నామకరణం చేసిన ప్రదేశం ఇదే. నాకు మంచి మధురమైన అనుభూతులు ఈ సినిమా థియేటర్‌తో ఉన్నాయి అని బాలకృష్ణ తెలిపారు.
మా అన్నయ్య నందమూరి మోహనకృష్ణకు ఈ థియేటర్ పున:ప్రారంభం సందర్భంగా ధన్యవాదాలు. ఇక్కడికి రావడంతో మళ్లీ పాత రోజులు గుర్తుకు వచ్చాయి. కాలేజీ రోజుల్లో ఈ దారి వెంటనే వెళ్లేవాళ్లం. ముషీరాబాద్‌లో రామకృష్ణ సినీ స్టూడియో ఉండేది. ముషీరాబాద్ నుంచి కాచిగూడ, అబిడ్స్‌కు వెళ్లేవాళ్లం అని బాలకృష్ణ పాత రోజులను గుర్తు చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











