Bhagavanthkesari Release Date: గీసారి దసరా జోర్దార్.. ఆయుధ పూజతో భగవంత్ కేసరి దిగుతుండు.. ఇక పూనకాలే!

నందమూరి నటసింహం బాలకృష్ణ.. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వీర సింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి... ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న భగవంత్ కేసరి సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా నుంచి మరో మాసివ్ అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....

భగవంత్ కేసరిగా బాలయ్య : బాలకృష్ణ ఈ ఏడాది.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాతో వచ్చాడు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి.. సూపర్ హిట్టుగా నిలిచింది. అంతకు ముందు అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు బాలయ్య. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా భగవంత్ కేసరి( ఐ డోంట్ కేర్) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ ఆగర్వల్ నటిస్తుండగా.. ఆయన కూతురి పాత్రలో శ్రీలీల నటించబోతుందని ప్రచారం జరుగుతోంది.

balakrishnabhagwantkesari3

తెలంగాణ యాసలో : ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ తో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. ఇక ఈ మూవీలో బాలయ్య బాబు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపించనున్నాడు. మొదటి సారిగా బాలయ్య ఇక ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన ట్రైలర్ లో బాలయ్య డైలాగ్స్ అయితే ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయన స్టైల్, లుక్ కు ఫిదా అయిపోతున్నారు.

డైలాగ్స్ వింటే గూస్ బంప్స్ : ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెడ్ మూవీతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అడవి బిడ్డ.. నేలకొండ భగవంత్ కేసరి.. ఈ పేరు శానా ఏళ్లు యాదుంటది.. అంటూ బాలయ్య తెలంగాణ యాసలో పలికిన డైలాగ్స్ అయితే ఫ్యాన్స్ లోనే కాదు.. ప్రేక్షుకుల్లో గూస్ బంప్స్ తెప్పించాయి. ఇక ఈ సినిమా గురించి ఫ్యాన్స్ తెగ ఈగర్ గా చూస్తున్నారు. మామూలుగా బాలయ్య సినిమా అంటేనే ఆగని ఫ్యాన్స్... ఇప్పుడు ఇలాంటి సబ్జెక్టుతో వస్తున్న బాలయ్య సినిమాకోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో చిత్ర బృందం మరో మాసివ్ అప్డేట్ ను అందించింది.

balakrishnabhagwantkesari3

మాసివ్ అప్డేట్ ఏంటంటే : ఇక ఈరోజు మాసివ్ అప్డేట్ ఇస్తామంటూ అంటూ చిత్రబృందం ప్రకటించింది. భగవంత్ కేసరి సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు రానుంది. ఈ సారి భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది అంటూ మేకర్స్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇక ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తోంది. ఇక రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ రిలీజ్ చేయగా.. అది ఆకట్టుకుంటోంది.

హ్యాట్రిక్ పై కన్నేసిన బాలయ్య : ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో తొలిసారిగా వస్తున్న చిత్రమిది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు.. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడు చూడని అవతారంలో చూడనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమా హిట్ అయితే గనుగ బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ పడనుంది. ఇక ఈ సినిమా హిట్టు అని భావిస్తున్నారు ఫ్యాన్స్. చూడాలి ఇక విడుదల అయితే కానీ తెలియదు.. బాలయ్య హ్యాట్రిక్ కొడతాడో లేదో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X