Nandamuri Balakrishna Birthday.. అభిమానులకు బాలయ్య గిఫ్టు ఏమిటో తెలుసా?

బాక్సాఫీస్ బోనాంజా, నటసింహం బాలకృష్ణ పుట్టిన రోజంటే నందమూరి అభిమానులకు పండగే పండుగ. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన తర్వాత నందమూరి బాలకృష్ణ తన జన్మదినాన్ని ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండేళ్లుగా బాలయ్య జన్మదినాన్ని జరుపుకోలేని అభిమానులు ఈ ఏడాది ఉత్సాహంగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకొనేందుకు ఏర్పాట్లలో ఉన్నారు. అయితే ఈ పుట్టిన రోజుకు నందమూరి అభిమానులకు బాలకృష్ణ ఇవ్వబోయే గిఫ్టు ఏమిటంటే?

రెండేళ్లుగా పుట్టిన రోజు వేడుకలకు దూరం

రెండేళ్లుగా పుట్టిన రోజు వేడుకలకు దూరం


గత రెండు, మూడేళ్లుగా పుట్టిన రోజున తన అభిమానులకు బాలకృష్ణ దూరంగా ఉంటూ వచ్చారు. కరోనా పరిస్థితుల కారణంగా తన జన్మదిన వేడుకలను వాయిదా వేసుకోవాలని అభిమానులకు బాలయ్య సూచించారు. దాంతో ఇంటిపట్టునే ఉంటూ అభిమానులు సంబరాలు చేసుకొన్నారు.

 జూన్ 10న గ్రాండ్ బాలయ్య బర్త్ డే

జూన్ 10న గ్రాండ్ బాలయ్య బర్త్ డే


ఇక 2022లో ఎలాంటి భయాందోళనలు లేకపోవడం వల్ల బాలకృష్ణ జన్మదినాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొనేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 10న వైభవంగా సెలబ్రేషన్స్‌కు తెర లేపుతున్నారు. ఈ పుట్టిన రోజున అభిమానులకు మలినేని గోపికృష్ణతో తీయబోయే సినిమాకు సంబంధించిన ఫస్ట్ హంట్ గానీ, మోషన్ పోస్టర్‌ను గానీ విడుదల చేసేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

NBK107 లుక్ లోడింగ్


బాలయ్య పుట్టిన రోజున NBK107 సినిమాకు సంబంధించి ఓ పోస్టర్‌ను గోపిచంద్ మలినేని ట్వీట్ చేశారు. బాలకృష్ణ రెండు చేతులు వెనక బాగంలో జోడించాడు. ఈ పోస్టర్‌లో బాలయ్య చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. గెట్ రెడీ NBK107 లోడింగ్ అంటూ దర్శకుడు మలినేని గోపిచంద్ ట్వీట్ చేశారు.

ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం

ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం


అయితే NBK107 సినిమాకు సంబంధించిన పోస్టర్ వస్తుందనే వార్త సోషల్ మీడియాలో లీక్ కాగానే అభిమానుల్లో ఉత్సాహం కట్టలు తెచ్చుకొంటున్నది. ఎలాంటి పోస్టర్‌తో బాలయ్య హల్‌చల్ చేస్తారనే విషయంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ పోస్టర్ జూన్ 9వ తేదీన సాయంత్రం గానీ.. లేదా 10వ తేది ఉదయం గానీ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

NBK107 నటీనటులు, సాంకేతిక నిపుణులు

NBK107 నటీనటులు, సాంకేతిక నిపుణులు


NBK107 చిత్రంలో బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు దునియా విజయ్ తెలుగు రంగానికి విలన్‌గా పరిచయం అవుతున్నారు.
సంగీతం: ఎస్ఎస్ థమన్
సినిమాటోగ్రఫి: రిషి పంజాబీ
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఎడిటింగ్: నవీన్ నూలీ
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
ఫైట్స్: రామ్ లక్ష్మణ్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై రవిశంకర్
దర్శకత్వం: మలినేని గోపిచంద్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X