twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'సింహా'లో బాలకృష్ణ పాత్ర ఎలా ఉంటుంది?

    By Srikanya
    |

    "వెంటాడటంలోనూ...వేటాడటంలోనూ...పౌరుషం లోనూ సింహాన్ని తలపించే పాత్ర ఇందులో బాలకృష్ణది. ఆయన గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో 'సింహా' ఉంటుందంటున్నారు దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. భద్ర,తులసి వంటి చిత్రాలు గతంలో రూపొందించిన ఆయన తాజాగా ఈ చిత్రాన్ని గ్యాప్ తీసుకుని పక్కా స్క్రిప్ట్ తో ముందుకొచ్చారు. బాలకృష్ణ ఇమేజ్ ను పెంచి, మాస్‌ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి' అని హామీ ఇస్తున్నారు ఆయన.అలాగే ఈ సినిమాలో 'నేను మాట్లాడేటప్పుడు ఈ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని వేరేది పనిచేసిందో నీ నెక్ట్స్ బర్త్‌డే ఉండదు" వంటి పరవ్ ఫుల్ డైలాగులును బాలయ్య చెప్తూంటారు.

    ఇక ఈ చిత్రంలో నయనతార, స్నేహాఉల్లాల్‌, నమిత ఈ చిత్రంలో బాలయ్య సరసన అలరించనున్నారు. అంతేగాక బాలయ్య-నయనతార కాంబినేషన్‌ ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాత పరుచూరి కిరిటి అంటున్నారు. అలాగే నయనతార నటించిన అదుర్స్ చిత్రం ఈ నెలలోనే రిలీజ్ కానుంది. నమిత కూడా ఈ చిత్రంతో మంచి క్రేజ్ వచ్చి తెలుగులో సెటిల్ అవ్వచ్చుననే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం ద్వారా బాలకృష్ణ చిత్రానికి చక్రి మొదటి సారి సంగీతాన్ని అందిస్తున్నారు. వరస ప్లాఫుల్లో ఉన్న బాలయ్యకు ఈ సింహా అయినా తిరిగి ఎప్పటి క్రేజ్ ని తీసుకువస్తుందని ఆశిద్దాం

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X