తారకరత్న ఆరోగ్యంపై బాలకృష్ణ వివరణ.. ఫోన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్!

నందమూరి తారకరత్న హఠాత్తుగా కార్డియక్ అరెస్ట్ కావడంతో అందరూ ఒక్కసారిగా కంగారు పడ్డారు. అయితే ప్రస్తుతం తారకరత్నకు పూర్తిస్థాయిలో వైద్యులు వైద్యం అందిస్తూ ఆయనని మళ్లీ సాధారణ పరిస్థితుల్లోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో తారకరత్న ఆరోగ్య విషయం గురించి ఎప్పటికప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక నందమూరి తారకరత్న ఆరోగ్యం విషయంలో మొదటిసారి నందమూరి బాలకృష్ణ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

స్పృహ తప్ప పడిపోవడంతో..

స్పృహ తప్ప పడిపోవడంతో..

కుప్పంలో నేడు ఉదయం తారకరత్న హఠాత్తుగా స్పృహ తప్ప పడిపోవడంతో అతన్ని వెంటనే సన్నిహితులు సమీపంలో ఉన్న కేసి ఆసుపత్రికి తరలించారు. మొదట కళ్ళు తిరిగి పడిపోయారు అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ అని తెలియడంతో వైద్యులు వెంటనే ఆయనకు చికిత్స అందించారు. ప్రస్తుతమైతే ఆరోగ్యం నిలకడగానే ఉంది అని వైద్యులు తెలియజేశారు కానీ ఇంకా పూర్తిగా కోలుకోవాలని అంటే మెరుగైన చికిత్స అందించాలని కూడా వైద్యులు చెబుతున్నారు.

కుటుంబ సబ్యులకు ధైర్యం చెబుతున్న బాలయ్య

కుటుంబ సబ్యులకు ధైర్యం చెబుతున్న బాలయ్య

ఇక తారకరత్న గురించి తెలియగానే నందమూరి బాలకృష్ణ వెంటనే ఆసుపత్రికి చేరుకొని వైద్యులతో మాట్లాడడం జరిగింది. అతని ఆరోగ్య విషయం గురించి ఎప్పటికప్పుడు వైద్యులు నందమూరి బాలకృష్ణకు తెలియజేస్తూనే ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యం చెబుతూ తప్పకుండా తారకరత్న కొలుకుంటాడు అని వివరణ ఇస్తున్నారు.

బాలయ్య వివరణ

బాలయ్య వివరణ

ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన నందమూరి బాలకృష్ణ తారకరత్న గురించి తెలియజేశారు. కుదిరితే తారకరత్నను బెంగళూరుకు తరలిస్తాం అంటూ అంబులెన్స్ లో తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతమైతే ఆందోళన చేద్దాల్సిన అవసరం లేదు అని డాక్టర్ల సూచనతోనే బెంగళూరుకి తరలిస్తామని గుండెల్లో ఎడమవైపు 90% వరకు బ్లాక్ అయ్యింది అని బాలకృష్ణ వివరణ ఇచ్చారు.

తారకరత్నకు ఏమి కాదు

తారకరత్నకు ఏమి కాదు

ఇక మిగతా రిపోర్టులు బాగున్నాయని కుటుంబ సభ్యులు అలాగే అభిమానుల దీవెనలు తారకరత్నపు ఎప్పుడూ తోడుగా ఉంటాయి కాబట్టి ఆయనకు ఏమీ కాదు అని అధైర్య పడాల్సిన అవసరం లేదు అని బాలయ్య అన్నారు. ఇక తప్పకుండా తారకరత్న కోలుకొని మన ముందుకు వస్తారని కూడా బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

 జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ కాల్

జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ కాల్

ఇక నందమూరి బాలకృష్ణ కు ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికే చాలామంది ఫోన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ కు ప్రత్యేకంగా ఫోన్ చేసి వారి అన్నయ్య ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బాలయ్య బాబుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X