twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Maa Elections: నేను ఓటు వేసింది వాళ్ళకే.. ఓటు వేసిన తరువాత బాలయ్య కామెంట్స్

    |

    టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల పోరులో గొడవల తీవ్రత మరింత పెరిగింది. ఇక ఉదయమే స్టార్ హీరోలు చాలా కూల్ గా వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వారి ఓటు హక్కును వినియోగించుకోగా ఆ తరువాత నందమూరి బాలకృష్ణ ఓటు వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. అలాగే ఆయన ఓటు ఎవరికి వేశారు అనే విషయంలో కూడా చాలా తెలివిగా స్పందించారు.

    Maa Elections 2021: ఓటు వేసిన చిరు, బాలకృష్ణ.. కౌగిలించుకున్న మోహన్ బాబు, ప్రకాష్ రాజ్(ఫోటోలు)Maa Elections 2021: ఓటు వేసిన చిరు, బాలకృష్ణ.. కౌగిలించుకున్న మోహన్ బాబు, ప్రకాష్ రాజ్(ఫోటోలు)

    బాలయ్యను ముందే కలిసిన విష్ణు

    బాలయ్యను ముందే కలిసిన విష్ణు

    నందమూరి బాలకృష్ణ చాలా కూల్ గా ఎన్నికల హడావుడి లో కనిపించారు. ఆయన పోటీలో ఉన్న ఇరు సభ్యులను కూడా కలుసుకోవడం జరిగింది. అయితే ఇంతకుముందే మంచు విష్ణు ప్రత్యేకంగా బాలకృష్ణను కలుసుకొని మద్దతు కోరడం జరిగింది. అఖండ షూటింగ్ లో ఉన్న బాలయ్య ప్రత్యేకంగా విష్ణుకు మద్దతు ఇస్తున్నట్లు సిగ్నల్ కూడా ఇచ్చారు. ఇక నేడు ఓటు వేసిన అనంతరం బాలయ్య ఇరు సబ్యులపై కూడా పాజిటివ్ గానే స్పందించారు.

    వారికే ఓటు వేశా..; బాలకృష్ణ

    వారికే ఓటు వేశా..; బాలకృష్ణ

    బాలకృష్ణ మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుడిగా మా ఎన్నికల్లో నా ఓటును వినియోగించుకోవడం జరిగింది. ముందుగా కళాకారులకు ఎవరు అయితే అన్ని విధాలుగా సహాయ పడతారో వారికే నేను ఓటు వేయడం జరిగింది. ఒక విధంగా ఇద్దరు కూడా ఇండస్ట్రీకి బాగా తోడ్పాటుగా ఉండే విధంగానే వర్క్ చేసేలా కనిపిస్తున్నారు. ఇక ఒకరికే వేయాలి కాబట్టి బెస్ట్ అనిపించినా వారికి, అలాగే మరొక ప్యానెల్ లో మిగతా వారికి కూడా ఎవరు బెస్ట్ అనేది ఆలోచించి ఓటు వేసినట్లు బాలకృష్ణ తెలియజేశారు.

    ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వల్లే..

    ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వల్లే..

    ఇక మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వల్లే. ఇద్దరు కూడా మాటలు చెప్పేవాల్లే కాదు. పనిలో కూడా చేసి చూపించేవాళ్ళు. ఈ ఎన్నికల అనంతరం మళ్ళీ రేపు అందరం కూడా షూటింగ్స్ లో కలుసుకునే వాళ్ళమే. ఇక ఇండస్ట్రీలో పేదవాళ్ళు, ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం అందేలా మూవీ ఆర్టిస్ట్ పని చేయాలి.

    ఇక ఎవరు గెలిచినా కూడా వారితో తాము కలిసి పని చేయడానికి సిద్ధమే. పేద కళాకారులను ఆదుకోవడం కేవలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులది మాత్రమే కాదని మా లోని ప్రతి మెంబర్ బాధ్యత అని నందమూరి బాలకృష్ణ తెలియజేశారు.

    Recommended Video

    Vijay Sethupathi తెలుగు బ్రాండ్ వాల్యూ పీక్స్.. | NBK పక్కన విలన్ గా నిజమే!! || Filmibeat Telugu
    రోజా కామెంట్స్

    రోజా కామెంట్స్

    ఇక కొద్దిసేపటి క్రితమే రోజా ఒక సినీ నటిగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఆలింగనం చేసుకోవడం మంచిదే అంటూ.. ఎవరు గెలిచినా కూడా మా కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. ఇక రెండు ప్రభుత్వాలు సినిమా కార్మికులకు అండగా ఉండాలని మా ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పారు. గతంలో ఎన్నడూ ఇలా ప్రచారం, హడావుడి జరగలేదు అంటూ నేను లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ను నమ్మను.. ఆ విషయానికి వస్తే హీరోయిన్లు అందరూ నాన్ లోకాలే అంటూ రోజా వివరణ ఇచ్చారు.

    English summary
    Nandamuri balakrishna comments on maa elections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X