అతని మరణం కలచివేసింది.. బాధగా ఉందంటూ ప్రగాఢ సానుభూతి తెలిపిన బాలకృష్ణ

Recommended Video

Nandamuri Balakrishna Pays Tribute To His Little Fan | గోకుల్ మృతి నా మనసును కలచివేసింది-బాలకృష్ణ

ఈ రోజుల్లో చిన్నారులు యమ స్పీడ్‌గా ఉంటున్నారు. వెనకటి సామెత చూసి రమ్మంటే.. కాల్చి వచ్చే టైపు ఈ కుర్రోళ్ళు. సోషల్ మీడియా, సినిమాలు, టాలెంట్ అనేది చిన్నప్పటి నుంచే అలవర్చుకుంటూ భేష్ అనిపించుకుంటున్నారు. అలాంటి చిన్నారుల్లో ఒకరే గోకుల్. బాలకృష్ణ డైలాగులు చెప్పి బాగా ఫేమస్ అయ్యాడీ కుర్రాడు. అయితే దేవుడి శాపమో లేక విధి రాతనో తెలియదు గానీ ఆ చిన్నారి ఆకస్మిక మరణం చెందడం వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసింది.

 బాలకృష్ణ డైలాగులు.. అచ్చం అలాగే

బాలకృష్ణ డైలాగులు.. అచ్చం అలాగే

బాలకృష్ణ సినిమాల్లో డైలాగులను చెప్పడంలో దిట్ట గోకుల్. అచ్చం బాలకృష్ణను పోలేలా హావభావాలతో, పవర్‌ఫుల్ డైలాగులు చెప్పేవాడు. ఇతని వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూండేవి. అలాంటి ఈ చిన్నారి మృతి చెందాడనే వార్త విని షాక్ అయ్యారు నెటిజన్లు.

డెంగ్యూ వ్యాధితో మరణం.. ఈ వార్త తెలిసి

డెంగ్యూ వ్యాధితో మరణం.. ఈ వార్త తెలిసి

బాలయ్య అభిమాని, అచ్చం ఆయన్ను ఇమిటేట్ చేసే గోకుల్.. కొన్ని రోజులు డెంగ్యూ వ్యాధితో బాధ పడుతూ తుదిశ్వాస విడిచాడు. ఈ వార్త తెలిసిన వెంటనే బాలకృష్ణ రియాక్ట్ అవుతూ తన వాయిస్ వినిపించారు. గోకుల్ మరణ వార్త తనను కలచి వేసిందని అన్నారు. ఈ మేరకు తన సందేశం ఇచ్చారు బాలయ్య.

ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది

ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది


''మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. అలాంటి చిన్నారి అభిమాని గోకుల్. నేనంటే ప్రాణం ఇచ్చే ఈ చిన్నారి ఈ రోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం.. హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటేసేది'' అని పేర్కొన్నాడు బాలకృష్ణ.

చాలా బాధ కలిగించింది.. ప్రగాఢ సానుభూతి

''ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ వ్యాధితో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం చాలా బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ నందమూరి బాలకృష్ణ'' అని తెలిపారు బాలకృష్ణ.

బాలకృష్ణ 105

బాలకృష్ణ 105

ప్రస్తుతం బాలకృష్ణ 105 వ సినిమా చేస్తున్నారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో బాలయ్య యంగ్ లుక్‌లో కనిపించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X