For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ 108వ సినిమా ఫిక్స్: పొరపాటున కన్ఫార్మ్ చేసిన నటసింహం.. ఎన్టీఆర్‌తో కలిసి వస్తున్నాడు

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచీ ఇదే పంథాను ఫాలో అవుతోన్నారాయన. ఈ క్రమంలోనే పలు విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. ఇక, ఈ మధ్య కాలం సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న బాలయ్య.. ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెడుతున్నారు. ఇప్పటికే ఒక సినిమాను అనౌన్స్ చేయగా.. మరో దానిని తాజాగా పొరపాటున రివీల్ చేసేశారు బాలకృష్ణ. అసలేం జరిగింది? ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

  ‘అఖండ'గా రాబోతున్న నటసింహం

  ‘అఖండ'గా రాబోతున్న నటసింహం

  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో నందమూరి బాలకృష్ణ చేస్తున్న చిత్రం ‘అఖండ'. ‘సింహా', ‘లెజెండ్' వంటి సూపర్ డూపర్ హిట్ల తర్వాత వస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, శ్రీకాంత్ నెగెటివ్ రోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య రెండు పాత్రలు చేస్తున్నారు.

  అప్పుడే రికార్డులు క్రియేట్ చేశారుగా

  అప్పుడే రికార్డులు క్రియేట్ చేశారుగా

  హిట్ కాంబినేషన్ కావడంతో ‘అఖండ' మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే బాలయ్య చిత్రం నుంచి ఏది వచ్చినా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ఉగాదికి ఈ మూవీ నుంచి టైటిల్ రోర్ వీడియో రిలీజ్ అయింది. దీనికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ వీడియో 50 పైచిలుకు మిలియన్లు వ్యూస్ సాధించి రికార్డును క్రియేట్ చేసింది.

  107వ సినిమాను ప్రకటించిన స్టార్

  107వ సినిమాను ప్రకటించిన స్టార్

  ‘అఖండ' తర్వాత బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరిగింది. అందుకు అనుగుణంగానే జూన్ 10 నటసింహం పుట్టినరోజున ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది నిజ జీవితం సంఘటన ఆధారంగా రూపొందనుంది.

  తర్వాతి సినిమాపై పుకార్లు షాకార్లు

  తర్వాతి సినిమాపై పుకార్లు షాకార్లు

  ప్రస్తుతం ‘అఖండ'లో నటిస్తోన్న నందమూరి బాలకృష్ణ.. దాని తర్వాత సినిమాను కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో ఆయన నటించబోయే 108వ మూవీ గురించి కూడా చాలా రోజులుగా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు దర్శకుల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అందులో పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడి సినిమాలు కన్ఫార్మ్ అన్న టాక్ వినిపించింది.

  108వ మూవీ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో

  108వ మూవీ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌తో

  ముందు నుంచీ ప్రచారం జరుగుతున్నట్లుగానే నందమూరి బాలకృష్ణ తన 108వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరొందిన అనిల్ రావిపూడితో చేయబోతున్నాడని తాజాగా ఓ న్యూస్ లీకైంది. నిజానికి అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్యనే ఆయన కోసం కథను రాస్తున్నట్లు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

  పొరపాటున రివీల్ చేసేసిన బాలయ్య

  పొరపాటున రివీల్ చేసేసిన బాలయ్య

  తన పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ న్యూజెర్సీలో ఉన్న తన అభిమానులతో జూమ్ యాప్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పొరపాటున తన 108వ సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహూ గారపాటి, హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

  ఆ కథతోనే సినిమా.. అలాంటి పాత్ర

  ఆ కథతోనే సినిమా.. అలాంటి పాత్ర

  బాలయ్యతో చేయబోయే సినిమా కోసం అనిల్ రావిపూడి ఎప్పుడో ‘రామారావు గారు' అనే కథను రెడీ చేశాడు. ఇప్పుడీ స్క్రిప్టుతోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇక, ఇందులో నటసింహం తొలిసారి పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ పాత్రలో నటిస్తున్నారట. ఎన్టీఆర్ పేరుతో రాబోయే ఈ సినిమా బాలయ్యకు తప్పకుండా సక్సెస్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు

  English summary
  Nandamuri Balakrishna Now Doing Akhanda with Boyapati Srinu. After this he will work with Gopichand Malineni. Now Balakrishna Confirm Anil Ravipudi Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X