Daaku Maharaaj: హిందిలోకి డాకు మహారాజ్.. రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Daaku Maharaaj: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన హై వోల్టేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. అలాగే.. కలెక్షన్ల పరంగా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఈ తరుణంలో డాకు మహారాజ్ మూవీ మేకర్స్ సంచల నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాను హిందీ వర్షన్ లో కూడా విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇంతకీ డాకు మహారాజ్ హిందీ వర్షన్ ఎప్పుడు రిలీజ్ కాబోతుందనే విషయాలపై ఓ లూక్కెయ్యండి..

అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ విజయాలను అందుకొని మంచి ఊపులో ఉన్న బాలయ్య, వరుస విజయాలతో జోరు మీద ఉన్న దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ)లు జత కలవడంతో 'డాకు మహారాజ్' అనే హిట్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ నాగవంశీ, సాయి సౌజన్యలు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

Nandamuri Balakrishna Daaku Maharaaj Hindi version s release release on January 24 2025

ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ సంగీతం అందించారు. బాలయ్య- బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి దీంతో ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఊహించని విధంగా జరిగింది. ఈ క్రమంలోనే ఈ మూవీ రూ. 84 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే రూ.85 కోట్ల షేర్.. రూ. 170 కోట్లను బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు

ఊహించిన విధంగానే డాకు మహారాజ్(Daaku Maharaaj) అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది. ప్రిమియర్ షోకు పాజిటివ్ టాక్ అందుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ తొలి రోజు రూ.56 కోట్లు వసూళ్లు రాబట్టినట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.160 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది డాకు మహారాజ్. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ మూవీని హిందీలో డబ్ చేయడానికి మూవీ మేకర్స్ సిద్దమయ్యారు.

పైగా డాకు మహారాజ్ సినిమా కథ దాదాపు నార్త్ లోనే జరుగుతుంది. ఈ సినిమా మేకింగ్ కూడా పాన్ ఇండియా సినిమాలతో పోటీ పడేలా రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా విజువల్స్ పరంగా, మ్యూజిక్ పరంగా ఎంతో బ్లాక్ హిట్ అందుకుంది. అందుకే ఈ మాస్ అండ్ యాక్షన్ ఫిల్మ్ హిందీ వెర్షన్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు 'డాకు మహారాజ్' హిందీ వెర్షన్ జనవరి 24 నుంచి అందుబాటులో విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. డాకు మహారాజ్ సినిమాను నార్త్ లో భారీ సంఖ్యలో విడుదల చేయాలని, హిందీ వెర్షన్ కు బాలకృష్ణనే డబ్బింగ్ చెప్పడం మరో విశేషం.

Nandamuri Balakrishna Daaku Maharaaj Hindi version s release release on January 24 2025

'డాకు మహారాజ్' సినిమాకు నార్త్ లో భారీ స్పందన వచ్చే అవకాశముంది. ఎందుకంటే..ఈ సినిమా స్టోరీ దాదాపు నార్త్ లోనే జరుగుతోంది. అలాగే.. ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్‌, సచిన్ ఖేడేకర్ వంటి బాలీవుడ్ యాక్టర్స్ నటించడం కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం. అలాగే..హిందీ ప్రేక్షకులు మాస్ సినిమాలను బాగా ఇష్టపడతారు. ఇప్పటికే విడుదలైన 'పుష్ప-2'ను నార్త్ ఆడియన్స్ ఎలా ఆదరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పావల్సిన అవసరం లేదు. అన్ని కలిసి వచ్చి డాకు హిందీ లో కూడా హిట్ అయితే.. బాక్సాఫీస్ దగ్గర బాలయ్య దబిడి దిబిడి మొదలవుతోందని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X