Daaku Maharaj: తిరుమలలో తొక్కిసలాట.. డాకు మహారాజ్‌ టీం సంచలన నిర్ణయం..

Daaku Maharaaj pre-release event: నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బాబీ కాంబోలో తెరకెక్కిన సినిమా "డాకు మహరాజ్"( Daku Maharaj ). ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం లో నిర్వహించాలనీ, భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఈవెంట్ కు బాలకృష్ణ అల్లుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కానీ, నిన్న తిరుమల లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు.

డాకు మహరాజ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అనంతపురంలో గ్రాండ్ గా ప్లాన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల భారీ విజయం సాధించిన తర్వాత హీరోగా బాలకృష్ణ.. అనంత‌పురంలో తొలి సినిమా ఈవెంట్‌ చేస్తున్న క్రమంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌, శ్రీక‌ర స్టూడియోస్‌ భారీగా ఏర్పాట్లు చేశారు. కానీ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఈ ఈవెంట్ తోపాటు మూవీకి సంబంధించిన ఇతర కార్యక్రమాలను కూడా రద్దు చేస్తున్నట్లు డాకు మహారాజ్ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు. జనవరి 9న సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Nandamuri Balakrishna Daaku Maharaaj pre-release event cancelled Due to the Tirumala stampede

ఈ క్రమంలోనే.. డాకు మహారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేశారు. "తిరుపతిలో జరిగిన విషాద ఘటన వల్ల డాకు మ‌హారాజ్ ఈవెంట్ ర‌ద్దు చేస్తున్నాం. ఈ విషాద ఘటనతో మా బృందం తీవ్రంగా ప్రభావితమైంది. సంస్కృతి, సంప్రదాయాలు విరాజిల్లే శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఇటువంటి సంఘటన జరగడం హృదయ విదారకం. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా #DaakuMaharaaj ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడం సముచితం కాదని మేము భావిస్తున్నాము. భ‌క్తులను, వారి మ‌నోభావాలను గౌర‌విస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో ఈవెంట్‌ను రద్దు చేసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. ఈ సమయంలో మముల్నీఅర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం' అని మూవీ మేకర్స్ ప్రకటించారు.

Nandamuri Balakrishna Daaku Maharaaj pre-release event cancelled Due to the Tirumala stampede

తిరుపతిలో జరిగిన తొక్కిలాట ఘటనపై హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతులకు నివాళిలర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులకు తనప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ విషాదకర సందర్భంలో అనంతపురంలో జరగాల్సిన డాకు మహారాజ్ ప్రీ ఈవెంట్ జరపడం సముచితం కాదనే ఉద్దేశంతో..ఆ ఈవెంట్ ను రద్దు చేశామని నందమూరి బాలకృష్ణ ఓ ప్రకటనలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X