'బేవకూఫ్..' అంటూ విరుచుకుపడ్డ బాలయ్య: చప్పట్లు కొట్టిన యాంకర్.. అసలేం జరిగింది?

Recommended Video

'బేవకూఫ్..' అన్న బాలయ్య.. చప్పట్లు కొట్టిన యాంకర్..!

ఒక్కో హీరోలో ఒక్కో స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. వాళ్ల సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ కూడా ఆ ఎలిమెంట్స్ తప్పకుండా ఆశిస్తారు. అందుకే అభిమానుల కోసమైనా సరే.. బాలయ్య సినిమాల్లో గుక్క తిప్పుకోకుండా చెప్పే డైలాగ్ ఒక్కటైనా ఉంటుంది.

తెరపై బాలయ్య ఆ డైలాగ్స్ చెబుతుంటే.. ఆయన ముఖంలో రౌద్రం చూసి ఫ్యాన్స్ విజిల్స్‌తో హోరెత్తించేస్తారు. ఇప్పుడు 'జైసింహా'తోనూ అభిమానులు ఆ హోరుకు సిద్దమైపోయారు. అభిమానులు పండుగ చేసుకునేలా.. జైసింహాలో బుల్లెట్‌లా పేలే డైలాగ్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

 బాలయ్య ఇంటర్వ్యూ

బాలయ్య ఇంటర్వ్యూ

జైసింహా ప్రమోషన్ లో భాగంగా తాజాగా బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల సినిమా విశేషాల గురించి అడగ్గా.. అదిరిపోయే డైలాగ్ ఒకటి చెప్పారు బాలయ్య.

 'మారకపోతే బేవకూఫ్'..:

'మారకపోతే బేవకూఫ్'..:

'ఎవరిని ఉంచాలో.. ఎవరిని లేపాలో అక్కడ ఉంటాది లెక్క. మీవాడి నుదిటి మీద బతుకు గీత లేదు. విధి రాత లేదు.. ఆయష్షు రేఖ లేదు. అక్కడ యుద్ధం చేసినా.. ఇక్కడ నీ పొగరు మారకపోతే బేవకూఫ్..' అంటూ తనదైన శైలిలో బాలయ్య డైలాగ్ పేల్చారు.

ఆశ్చర్యపోయిన శ్యామల:

ఆశ్చర్యపోయిన శ్యామల:

బాలయ్య అలా గుక్క తిప్పుకోకుండా డైలాగ్ చెబుతుంటే యాంకర్ శ్యామల చప్పట్లు కొడుతూ భలే ఎంజాయ్ చేసింది. ఇలా గుక్క తిప్పుకోకుండా ఇంత భారీ డైలాగ్స్ చెప్పడం ఎలా సాధ్యమంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే దానికి బాలయ్య ఏం సమాధానం చెప్పారన్నది.. పూర్తి ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయితే గానీ చెప్పలేం.

 పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్:

పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్:

జైసింహా సినిమా బాలయ్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని చెబుతున్నారు నిర్మాత సి. కల్యాణ్. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా సినిమాల్లో లాగా ఇందులోనూ పవర్‌ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, అందులో బాలయ్య విశ్వరూపం చూడవచ్చునని ఆయన అంటున్నారు.

 అద్భుతమైన డైలాగ్స్:

అద్భుతమైన డైలాగ్స్:

బాలయ్య మిగతా సినిమాల్లో లాగే ఈ సినిమాలోనూ పవర్ ఫుల్ డైలాగ్స్ చాలానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అభిమానులను సర్ ప్రైజ్ చేయడం కోసం ఎక్కడా వాటిని రివీల్ చేయడం లేదు.

ఇక సినిమాలో యాక్షన్ కు తోడు సెంటిమెంట్ కు కూడా పెద్ద పీట వేశామని కల్యాణ్ చెప్పారు. మొత్తంగా యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుతో ఈసారి సంక్రాంతికి బాలయ్య విందు భోజనం పెట్టనున్నారన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X