హాట్ టాపిక్: కరోనా కట్టడికి బాలకృష్ణ భారీ సాయం.. ప్రియమైన సోదరా అంటూ చిరంజీవి రియాక్షన్
దేశంలో కోరలు చాస్తున్న కరోనా వైరస్ కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. కరోనాను అంతమొందించాలని కృషి చేస్తున్నాయి. ఈ మేరకు దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించి అమలు చేస్తున్నాయి. అయితే కరోనా కట్టడిలో తామూ భాగమవుతామంటూ స్వచ్చందంగా ముందుకొస్తున్నారు సినీ ప్రముఖులు. తాజాగా నందమూరి బాలకృష్ణ తన విరాళాన్ని ప్రకటించారు. ఆ వివరాలు చూద్దామా..
Recommended Video

ముందుకొచ్చిన బాలయ్య.. ఆర్థిక సాయం
టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో బాలకృష్ణ కరోనాపై పోరాటటానికి తన వంతు ఆర్థిక సాయం అందించారు. మొత్తంగా రూ.1.25 కోట్లు విరాళంగా ఇచ్చారు బాలకృష్ణ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు 50 లక్షల రూపాయల చొప్పున కేటాయించిన ఆయన సీసీసీకి మరో 25 లక్షలు ఇచ్చారు.

కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)..
కరోనా కల్లోలంతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా ఉండటానికై చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా నిరుపేదలైన సినీ కార్మికులకు అండగా నిలుస్తామని, ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు.

సీ కల్యాణ్‌కు చెక్..
చిరంజీవి పిలుపు మేరకు ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, నాగార్జున, లావణ్య త్రిపాఠి సహా ఎందరో టాలీవుడ్ నటీనటులు కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ)కి సాయం అందించారు. తాజాగా నందమూరి బాలకృష్ణ 25 లక్షల రూపాయల చెక్‌ను సీసీసీ కార్యనిర్వాహక సభ్యుడు సీ కల్యాణ్‌కు అందించారు.

నా ప్రియమైన సోదరా.. చిరంజీవి రియాక్షన్
బాలకృష్ణ అందించిన ఈ ఆర్థిక సాయంపై మెగాస్టార్ చిరంజీవి వెంటనే రియాక్ట్ అయ్యారు. తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ''నా ప్రియమైన సోదరా బాలకృష్ణ.. సీసీసీకి రూ.25 లక్షలు, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున విరాళంగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అవసరం ఉన్న సమయాల్లో మీ సాయం అందిస్తూ మీ మంచి మనసుని చాటుకుంటుంటారు'' అని అన్నారు.

అన్నివేళలా తోడుంటారు.. చిరు ప్రశంసలు
అంతేకాదు ''ప్రతి కష్ట సమయంలోనూ ప్రజలను ఆదుకోవటం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరు అన్ని వేళలా తోడుంటారు'' అని పేర్కొంటూ బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి. ఆయన చేసిన ఈ ట్వీట్ చూసి నందమూరి అభిమానులు ఖుషీ అవుతూ ధన్యవాదాలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











