అభిషేక సేవలో బాలకృష్ణ
ఈ వేకువజామున స్వామివారి అభిషేక సేవలో నూతన దంపతులతో కలిసి బాలయ్య పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి బాలయ్య, నూతన దంపతులను శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. బాలయ్యను చూసేందుకు ఆలయం వద్దకుఅభిమానులు భారీగా తరలివచ్చారు.
ఇక బాలకృష్ణ, వసుంధరాదేవి దంపతుల చిన్న కుమార్తె తేజస్విని వివాహం మతుకుమల్లి శ్రీపట్టాభి రామారావు, శ్రీమణి దంపతుల కుమారుడు శ్రీభరత్‌తో జరిగింది. మంగళవారం ఉదయం 8.52 గంటలకు తేజస్విని మెడలో శ్రీభరత్ మూడు ముళ్లూ వేశాడు. హైదరాబాద్, మాదాపూర్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభోగంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇటు సినీ, అటు రాజకీయ రంగాలకు చెందిన అనేకమంది హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
బాలకృష్ణ అభిమానులూ ఇతోధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకకు మరింత కళ తీసుకువచ్చారు. సినిమా సెట్స్‌ను తలపించేరీతిలో సంప్రదాయబద్ధంగా వేసిన భారీ సెట్‌లో కన్నుల పండువగా జరిగిన ఈ వివాహానికి రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామికరంగ ప్రముఖులతో పాటు వేలాది సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. సినీ ప్రముఖులు సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల, కృష్ణంరాజు, దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, అంబికా కృష్ణ, వెంకటేష్, మోహన్‌బాబు, జగపతిబాబు, మురళీమోహన్, రోజా, సి.కల్యాణ్, శ్రీకాంత్, బోయపాటి శ్రీను, నందమూరి కల్యాణ్‌రామ్, మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్, నారా రోహిత్, తరుణ్, శివాజీరాజా, ఉదయ్‌కిరణ్ తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications












