twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీఎం జగన్ నిజంగానే బాలయ్య ఫ్యాన్: రహస్యాలు బయటపెట్టిన నందమూరి అభిమాని.!

    |

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. హీరో నందమూరి బాలకృష్ణకు అభిమానా..? ఆయన అభిమాన సంఘానికి జగన్ అధ్యక్షుడిగా కొనసాగారా..? కడపలో షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పటి సీఎం కొడుకు బాలయ్యకు ఏం సాయం చేశారు..? కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో వెనుక రహస్యం ఏమిటి..? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య తరచూ ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతపురం జగన్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను వెల్లడించారు.

    బాలకృష్ణకు జగన్ వీరాభిమాని

    బాలకృష్ణకు జగన్ వీరాభిమాని

    నందమూరి బాలకృష్ణకు అనంతపురం జగన్ వీరాభిమాని. తన చిన్న వయసు నుంచే ఆయనపై ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత బాలయ్య పుట్టినరోజుకు సేవా కార్యక్రమాలు చేయడం.. సినిమా విడుదలైతే పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం వంటి వాటితో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యాన్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఈ క్రమంలోనే బాలయ్య దృష్టిలో కూడా పడ్డారు.

    పక్కనే కుర్చీ వేసి కూర్చోబెట్టారు

    పక్కనే కుర్చీ వేసి కూర్చోబెట్టారు

    ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని జగన్ వెల్లడించారు. ‘నేను ఎప్పుడైనా షూటింగ్ స్పాట్‌కు వెళ్తే ఆయన పక్కనే కుర్చీ వేసి కూర్చోబెడతారు. అంతేకాదు, ఎవరైనా పెద్ద వాళ్లు వస్తే అనంతపురం జగన్.. నా ఫ్యాన్ అని చెబుతారు. నా పేరు కూడా ఆయనే పెట్టారు. అలాగే, ఓ సారి ఆయన ఇంటికి వెళ్తే లోపలికి పిలిచి మరీ భోజనం పెట్టారు. ఫ్యాన్స్‌ను ఆయన ఎంతో బాగా చూసుకుంటారు' అని చెప్పుకొచ్చారు.

    ఏపీ సీఎం జగన్ బాలయ్య ఫ్యానే

    ఏపీ సీఎం జగన్ బాలయ్య ఫ్యానే

    ఇదే ఇంటర్య్వూలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గురించి కూడా స్పందించారు. ‘కడపలో వైఎస్ ఫ్యామిలీ అంటే ఓ బ్రాండ్. అందుకే వాళ్ల అండ ఉండాలని అందరూ అనుకుంటారు. ఈ క్రమంలోనే బాలయ్య అసోసియేషన్‌కు జగన్ గారిని గౌరవ అధ్యక్షుడిగా చెప్పుకునేవారు. వాస్తవానికి ఆయనకు కూడా బాలయ్య అంటే ఇష్టమేనట. అందుకే అది కంటిన్యూ అయింది' అని అనంతపురం జగన్ వెల్లడించారు.

    వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు బాలయ్యను అలా..

    వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు బాలయ్యను అలా..

    అలాగే, వైఎస్ జగన్.. బాలయ్య మధ్య సంబంధం గురించి కూడా మాట్లాడారు. ‘ఒకసారి కడపలో షూటింగ్ జరుగుతోంది. అప్పుడు వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బాలయ్య కడప వస్తే భారీ స్థాయిలో ఆహ్వానం అందింది. వైఎస్ కుటుంబ సభ్యులే దగ్గరుండి ఆయనకు మర్యాదలు చేసేవారు. అదే.. వైఎస్ జగన్ లేకపోతే అలాంటి ఆతిథ్యం అందేది కాదు కదా' అని వివరించారు.

     ఆ ఫోటో వెనుక రహస్యం ఇదే

    ఆ ఫోటో వెనుక రహస్యం ఇదే

    ఏపీలో వైసీపీ గెలిచిన తర్వాత అపుడెపుడో ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన ‘సమరసింహారెడ్డి' సినిమా కడపలో దాదాపు యేడాది పైగా నడించింది. ఈ సందర్భంగా 2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఇచ్చిన పేపర్ ప్రకటన వైరల్ అయింది. దాని గురించి కూడా అనంతపురం జగన్ స్పందించారు. ‘అది బాలయ్య ఫ్యాన్స్ వేయించింది మాత్రమే. అయితే దానిపై వైఎస్ ఫ్యామిలీ కూడా అభ్యంతరం చెప్పలేదు' అని స్పష్టం చేశారు.

    English summary
    Tollywood Bold Heroines Place Nandamuri Balakrishna in upcoming untitled film, which will be helmed by KS RaviKumar and will be bankrolled by C Kalyan. This Movie Will Release 2020 sankranthi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X