మెగా హీరోల గురించి మాట్లాడితే బాలయ్యకు కోపం వస్తుంది: నందమూరి ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

Recommended Video

Nandamuri Balakrishna Fan Comments On Mega Heroes || నందమూరి ఫ్యాన్ షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. హీరో నందమూరి బాలకృష్ణకు అభిమానా..? ఆయన అభిమాన సంఘానికి జగన్ అధ్యక్షుడిగా కొనసాగారా..? కడపలో షూటింగ్ జరుగుతున్న సమయంలో అప్పటి సీఎం కొడుకు బాలయ్యకు ఏం సాయం చేశారు..? కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటో వెనుక రహస్యం ఏమిటి..? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య తరచూ ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతపురం జగన్ ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను వెల్లడించారు.

బాలకృష్ణకు జగన్ వీరాభిమాని

బాలకృష్ణకు జగన్ వీరాభిమాని

నందమూరి బాలకృష్ణకు అనంతపురం జగన్ వీరాభిమాని. తన చిన్న వయసు నుంచే ఆయనపై ఎంతో అభిమానాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత బాలయ్య పుట్టినరోజుకు సేవా కార్యక్రమాలు చేయడం.. సినిమా విడుదలైతే పండుగలా సెలబ్రేట్ చేసుకోవడం వంటి వాటితో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యాన్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఈ క్రమంలోనే బాలయ్య దృష్టిలో కూడా పడ్డారు.

పక్కనే కుర్చీ వేసి కూర్చోబెట్టారు

పక్కనే కుర్చీ వేసి కూర్చోబెట్టారు

ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని జగన్ వెల్లడించారు. ‘నేను ఎప్పుడైనా షూటింగ్ స్పాట్‌కు వెళ్తే ఆయన పక్కనే కుర్చీ వేసి కూర్చోబెడతారు. అంతేకాదు, ఎవరైనా పెద్ద వాళ్లు వస్తే అనంతపురం జగన్.. నా ఫ్యాన్ అని చెబుతారు. నా పేరు కూడా ఆయనే పెట్టారు. అలాగే, ఓ సారి ఆయన ఇంటికి వెళ్తే లోపలికి పిలిచి మరీ భోజనం పెట్టారు. ఫ్యాన్స్‌ను ఆయన ఎంతో బాగా చూసుకుంటారు' అని చెప్పుకొచ్చారు.

మెగా హీరోల గురించి మాట్లాడితే నచ్చదు

మెగా హీరోల గురించి మాట్లాడితే నచ్చదు

అలాగే, మెగా హీరోల గురించి మాట్లాడితే బాలయ్యకు నచ్చదని జగన్ తెలిపారు. ‘మేము ఎప్పుడైనా మెగా హీరోల సినిమా సరిగా ఆడడం లేదు. మెగా హీరోలు ఇలా చేస్తున్నారు.. అలా చేస్తున్నారు అని అంటే ఆయనకు కోపం వస్తుంది. ఎదుటి వాళ్ల గురించి మనం ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు. మన పని మాత్రమే మనం చేసుకోవాలి' అని చెబుతూ ఉంటారు. అయినా, ఎవరైనా మాట్లాడితే ఆయనకు కోపం వస్తుంది.

ఆ లుక్కుల వెనుక రహస్యం ఇదే

ఆ లుక్కుల వెనుక రహస్యం ఇదే

బాలయ్య ఈ సినిమా కోసం ఎంతగానో కష్ట పడుతున్నట్లు తెలుస్తోంది. తన అభిమానులకు ఎలాగైనా మంచి సినిమాను అందించాలన్న కసితో పని చేస్తున్న బాలయ్య.. అదే సమయంలో తనలో తాను కొంత మార్పులు కూడా చేసుకుంటున్నారని సమాచారం. ఇందులో భాగంగానే సన్నగా అవడం కోసం ఆయన రోజుకు ఐదు గంటల పాటు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారట. ఈ కారణంగానే ఆయన లుక్‌లో వేరియేషన్ కనిపిస్తుందని టాక్.

 ప్రస్తుతం చేస్తున్న సినిమా

ప్రస్తుతం చేస్తున్న సినిమా

గతంలో ‘జై సింహా' వంటి సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X