చంద్రబాబు ఇష్యూపై బాలయ్య రియాక్షన్: సంచలన హత్య కేసును లాగుతూ.. వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రచ్చలకు కారణం అవుతున్నాయి. నిత్యం ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య ఏదో ఒక ఇష్యూలో వివాదాలు చెలరేగడం సర్వసాధారణం అయిపోయింది. దీంతో ఎప్పుడూ ఏదో ఒక అంశం హైలైట్ అవుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

దీంతో ఆయన అసెంబ్లీలోనే కన్నీటీ పర్యంతం అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనూ వెక్కి వెక్కి ఏడ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఆ సంగతులు మీకోసం!

వైసీపీ ఎమ్మెల్యేల అసభ్య వ్యాఖ్యలు

వైసీపీ ఎమ్మెల్యేల అసభ్య వ్యాఖ్యలు

శుక్రవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న సమయంలో కొన్ని అంశాలపై చర్చ జరగాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. అప్పుడు వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించారు. అంతేకాదు, ఆయన సతీమణి భువనేశ్వరిపైనా అసభ్యకరమై వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని వీడారు.

ఏడ్చిన చంద్రబాబు.. ఆగ్రహ జ్వాల

ఏడ్చిన చంద్రబాబు.. ఆగ్రహ జ్వాల

అసెంబ్లీలో జరిగిన సంఘటన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన తనకు రెండున్నరేళ్లుగా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని చెబుతూ కన్నీరు మున్నీరు అయ్యారు. అదే సమయంలో తన భార్యను తిట్టడంపై ఆయన తట్టుకోలేకపోయారు. ఇది చూసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఇష్యూపై స్పందించిన బాలయ్య

ఆ ఇష్యూపై స్పందించిన బాలయ్య

శుక్రవారం జరిగిన పలు గొడవలతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వేడెక్కిపోయింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొడవలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ ఇష్యూపై సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు కూడా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ.. చంద్రబాబు ఇష్యూపై రియాక్ట్ అయ్యారు.

అసెంబ్లీనా... గొడ్ల చావిడా అంటూ

అసెంబ్లీనా... గొడ్ల చావిడా అంటూ

చంద్రబాబు ఇష్యూపై మాట్లాడేందుకు బాలకృష్ణ హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 'ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించాల్సిన అసెంబ్లీలో క్యారెక్ట‌ర్ అస్సాసినేష‌న్ మంచిది కాదు. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. కానీ, వీళ్ల వల్ల గొడ్ల‌చావిట్లో ఉన్నామా, అసెంబ్లీలో ఉన్నామా అన్న అనుమానం క‌లుగుతోంది' అని చెప్పుకొచ్చారు.

సంచలన హత్య కేసును లాగుతూ

సంచలన హత్య కేసును లాగుతూ

మీడియా సమావేశంలో బాలయ్య మాట్లాడుతూ.. 'అసలు వాళ్ల ఫ్యామిలీలో జరిగిన కేసు గురించి విచారణ చేయమని అడిగారు. కుటుంబ సభ్యులపైనే అనుమానం ఉందని గతంలో వాళ్ల వాళ్లే కామెంట్లు చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుల పేరు కూడా బయటకు వచ్చింది. దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇలా వ్యక్తిగత దూషణకు దిగారు' అంటూ వివేకా హ్యతను పరోక్షంగా ప్రస్తావించారు.

ఇకమీద సహించేది లేదు ఖబడ్దార్

ఇకమీద సహించేది లేదు ఖబడ్దార్

అసెంబ్లీ వేదికగా ఆడవాళ్లపై వైసీపీ నాయకులు చేసిన కామెంట్లపై స్పందించిన బాలయ్య 'ఏదయినా ఉంటే ఇష్యూ మీద ఫైట్ చేయాలి కానీ ఇంట్లో లేడీస్ మీద కామెంట్స్ చేయటం చాలా బాధాకరం. అందరి ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారికీ గౌరవం ఇవ్వటం మన సంప్రదాయం. ఇక మీదట ఇలాంటి కామెంట్స్ చేస్తే సహించేది లేదు ఖబడ్దార్' అంటూ వార్నింగ్ ఇచ్చారు.

చంద్రబాబు చెప్పినా వినేది లేదు

చంద్రబాబు చెప్పినా వినేది లేదు

తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణ కలిగిందని చెప్పిన బాలకృష్ణ.. 'ఇక మీదట మాకు చంద్రబాబు నాయుడు గారి అనుమతి కూడా అవసరం లేదు. ఇప్పటి వరకూ ఆయన మమ్మల్ని ఆపారు. చాల సార్లు సర్ది చెప్పారు. ఇక మీదట ఎవరు అయిన తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇప్పటికైనా మీ మాటతీరును, భాషను మార్చుకోండి' అంటూ హెచ్చరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X