సీక్రెట్?, ఈసారికి ఇది దాచిపెడుతున్నా.. ఆమెను మెచ్చుకోవాల్సిందే: 'జైసింహా'పై బాలయ్య

Recommended Video

'జై సింహ' ట్రైలర్.. బాలయ్య అదరగొట్టాడుగా !

సింహా టైటిల్స్‌కు బాలయ్య పౌరుషం తోడైతే ఆ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అనే ఓ సెంటిమెంట్ నాటుకుపోయింది. గతంలో వచ్చిన 'సమరసింహా రెడ్డి', 'నరసింహానాయుడు', లక్ష్మీ నరసింహా, సింహా, సినిమాలు ఈ ట్రెండ్ సెట్ చేశాయి.

అదే ట్రెండ్‌ను కొనసాగించడానికి ఇప్పుడు 'జైసింహా'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బాలయ్య. జనవరి 12న విడుదలకు సిద్దమైన ఈ సినిమా గురించి బాలయ్య చెప్పిన పలు ఆసక్తికర విశేషాలు ఆయన మాటల్లోనే..

 ట్రైలర్ మాస్ ఆడియెన్స్‌ను గురిపెట్టినట్లుంది?:

ట్రైలర్ మాస్ ఆడియెన్స్‌ను గురిపెట్టినట్లుంది?:

ఇది మాస్‌కే పరిమితమయ్యే సినిమా కాదు. అన్ని రకాల రుచులు మేళవించిన చిత్రమిది. నా జీవితంలో జరిగినవేవీ నేను కోరుకోలేదు, అన్నీ అలా వచ్చి వాలుతున్నాయి. 'జై సింహా' కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి సినిమా. 57 ఏళ్ల వయసులోనూ నేనిలా విభిన్న పాత్రల్లో నటిస్తున్నానంటే అదో అద్భుతం.

 ఆమెను మెచ్చుకోవాలి..:

ఆమెను మెచ్చుకోవాలి..:

సినిమాలో నయనతార ఓ మధ్య తరగతి అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. నయనతార ఏ పాత్ర చేసినా.. అందులో లీనమైపోతారు. ఆ అమ్మాయి నటనకు మానసికంగా అందరూ కనెక్ట్ అవుతారు. ఆ విషయంలో తను చాలా పర్‌ఫెక్ట్‌.

 కె.ఎస్ రవికుమార్‌తో సినిమా చేయడంపై..:

కె.ఎస్ రవికుమార్‌తో సినిమా చేయడంపై..:

గతంలో నాలుగైదు సార్లు సినిమా చేయాలని అనుకున్నాం గానీ కుదరలేదు. ఇన్నిరోజులకు సాధ్యపడింది. తెరపై అన్ని రసాలను అద్భుతంగా పండించగల దర్శకుడాయన. 'ముత్తు', 'దశావతారం' లాంటి మంచి సినిమాలు తీశారు. ఆయన స్టార్ డమ్ ఉన్న డైరెక్టర్ మాత్రమే కాదు నిజాయితీ, అంకితభావం ఉన్న డైరెక్టర్.

 ట్రైలర్‌లో నయనతార డైలాగ్‌పై?:

ట్రైలర్‌లో నయనతార డైలాగ్‌పై?:

'నీకు వయసు అయిపోదు.. కానీ నాకు వయసు అయిపోతోంది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్‌' అని నయనతార ఓ డైలాగ్ చెబుతుంది. నిజానికి ఆ డైలాగ్‌ చెప్పడానికి ఒప్పుకొన్నందుకు ముందు ఆమెను మెచ్చుకోవాలి. వేరే నటులైతే వయసు గుర్తుచేసే డైలాగ్ కాబట్టి అభ్యంతరపెట్టేవాళ్లేమో. ఇక నా విషయానికొస్తే.. మెంటల్‌గా నేను యంగ్‌.

 మూడో హీరోయిన్‌..

మూడో హీరోయిన్‌..

ఈ సినిమాలో నటాషా మూడో హీరోయిన్‌. హీరోను ప్రేమిస్తుంది, కానీ అతడితో జీవితాన్ని పంచుకోలేకపోతుంది. యూత్‌ను బాగా ఆకట్టుకునే పాత్ర ఆమెది.

'కొన్ని చెప్పకూడదు'..:

'కొన్ని చెప్పకూడదు'..:

సినిమాలో హరిప్రియ ఇంకో కథానాయిక. గతంలో 'పిల్ల జమీందార్' సినిమాలో నటించింది. సినిమాలో ఆమె పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. అద్భుతమైన పాత్ర. కానీ ఆ పాత్ర గురించి మాత్రం చెప్పను.

కొన్ని సినిమాల్లో కొన్ని చెప్పకూడదంతే. నా సినిమాకు సంబంధించి విడుదలకు ముందు ఏదో ఒకటి అలా దాస్తుంటాం. సినిమా విడుదల వరకు ఆమె పాత్రను రివీల్ చేయకుండా దాచిపెడుతున్నా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X