బాలయ్య బాబు కోమరం భీమ్ గెటప్ అదిరిందంటున్న అభిమానులు..

By Nageswara Rao

బాలకృష్ణ, దాసరి నారాయణరావు కలయికలో ఓ అధ్బుత చేయడానికి వస్తున్న సినిమా పరమవీర చక్ర. ఈసినిమాలో బాలయ్య బాబు చేసినటువంటి నటనా విశ్వరూపం యావత్ ఆయన అభిమానులను అలరించనుందని తెలిపారు. ఇక ఈసినిమాకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకోని డిసెంబర్ 28న ఆడియోని మార్కెట్లో కివిడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈసినిమాలో బాలయ్య బాబు రెండు పాత్రలను పోషించనున్న సంగతి అందరికి తెలిసిందే. ఒకరు ఆర్మీ మేజర్ గా, మరోకరు సినీ హీరోగా..

ఇంకోక విషయం ఏమిటంటే ఇందులో బాలయ్య బాబు నటనా వైరుద్యం అందరిని ఆకట్టుకునేలా ఉంటుందని దాసరి నారాయణరావు ఎప్పుడో చెప్పారు. ఇందులో బాలయ్య బాబు కోసం ప్రత్యేకంగా ఓప్రత్యేకమైన సాంగ్ పెట్టినసంగతి తెలిసిందే. ప్రత్యేకమైన సాంగ్ లో బాలయ్య బాబు తెలుగు తెరమీద మరియు తెలుగుజాతిని గుర్తుకు తెచ్చే విధంగా వేషాలను వేసినట్లు సమాచారం. ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి కోమరం భీమ్. కోమరం భీమ్ తెలంగాణ పోరాటయోధుడు. తెలంగాణ ప్రజల గురించి వారి యోగ క్షేమాలను కాపాడంకోసం ఆయన అప్పుడు తిరుగుబాటు చేసిన సంగతి అందరికి తెలిసిందే.

ఈపాత్రం కోసం బాబు ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంత పెద్దలను కలసుకోని ఆయన గురించి తెలుసుకోని మరీ ఈపాత్ర ఇష్టపడి చేస్తున్నారు. అలాంటి పాత్రలో బాలయ్య బాబు ఎలాఉంటారనేది ఆయన అభిమానులకోసం వన్ ఇండియా మీముందుకు తెచ్చింది. ఇక ఈసినిమాలో హీరోయిన్లుగా అమీషాపటేల్, నేహా దూపియా, షీలా నటిస్తున్నారు. ఈసినిమా ఆడియోని డిసెంబర్ 28న విడుదల చేసి, సినిమాని జనవరి12న ప్రేక్షకుల ముందుకి తీసుకోనిరానున్నట్లు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X