Balakrishna: మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను: బాలయ్య మాస్ వార్నింగ్

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని సృష్టించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఇక ఈ అరెస్ట్ అప్రజాస్వామికం అని ఇప్పటికే పలు రాజకీయా నాయకులు చెప్పుకొచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సైతం.. ప్రెస్ మీట్ పెట్టి... సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే....

2011లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో అవినీతి జరిగిందని టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ అరెస్టును అక్రమ అరెస్టు అంటూ రాజకీయ ప్రముఖులు ఆరోపిస్తుంటే.. వైసీపీ శ్రేణులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ సైతం ఈ అరెస్టుపై మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారని ఆరోపించారు.

Nandamuri Balakrishna Mass Warning to AP CM YS Jagan About CBN Arrest issue

సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్షసాధింపులే లక్ష్యంగా సీఎం జగన్‌ పనిచేస్తున్నారని బాలకృష్ణ మండిపడ్డారు.. జగన్‌ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ... వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

బాలకృష్ణ మాట్లాడుతూ.... అవినీతి జరిగిందని సృష్టించి చంద్రబాబును కస్టడీలోకి తీసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా కక్ష సాధింపుతోనే కుట్ర చేశారు. సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్షాలపై కక్ష సాధింపులే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారు. జగన్ జైలుకు వెళ్లొచ్చారని అందరినీ పంపాలని ప్రయత్నిస్తున్నారు. పేద విద్యార్థుల కోసం చంద్రబాబు ఎన్నో విద్యాసంస్థలు తీసుకొచ్చారని ఫైర్ అయ్యారు.

Nandamuri Balakrishna Mass Warning to AP CM YS Jagan About CBN Arrest issue

''హిందూపురంలో 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వేలమంది యువతకు ఉపాధి కల్పించిన సంగతి మరిచారా? అవినీతి జరిగితే ఆధారాలు చూపించాలి కదా? అవినీతి జరిగితే ఛార్జిషీట్ ఎందుకు వేయలేదు? రాజకీయ కక్షసాధింపులు తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. కక్ష సాధింపులే జగన్ లక్ష్యం.'' అంటూ వెల్లడించారు.

ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలు చేస్తున్నారు. జగన్ 16 నెలలు జైల్లో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్ కుట్ర. స్కిల్ డెవలప్‌మెంట్ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్ చంద్రారెడ్డి అమలు చేశారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చారని తెలిపారు.

Nandamuri Balakrishna Mass Warning to AP CM YS Jagan About CBN Arrest issue

ఇక బాలకృష్ణ మాట్లాడుతూ..... డిజైన్ టెక్ సంస్థకు జగన్ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది. జగన్.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు . ఉన్న సంస్థలు విధ్వంసం చేసి.. యువతను గంజాయికి బానిస చేశారు. జగన్ చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు గాలికబుర్లు చెబుతున్నారు.. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారని అన్నారు.

Nandamuri Balakrishna Mass Warning to AP CM YS Jagan About CBN Arrest issue

జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని బాలకృష్ణ విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ పడకేసిందని అన్నారు. రాజధాని ఏదో తెలియని పరిస్థితని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పై పీడీయాక్ట్, ఈడీ, సీబీఐ కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. 10 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని తెలిపారు. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలని సూచించారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించనని మాస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిదన్నారు. నేను మీ ముందుంటా.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని బాలకృష్ణ అన్నారు. తెలుగువాడి పౌరుషం ఏంటో చూపిద్దామని పిలుపునిచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X