బాలయ్య వయసు తగ్గిపోయిందా ఏంటీ.. కొత్త లుక్ అదిరిపోయిందిగా.. ఆశ్చర్యంలో సినీ ప్రియులు

Recommended Video

Nandamuri Balakrishna New Look Goes Viral In Social Media || Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినీ చరిత్రలో చెప్పుకోదగ్గ హీరోలలో ఒకరు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ఈయన పేరుపై రిజిష్టర్ అయి ఉన్నన్ని ఫ్యాన్ గ్రూపులు మరే హీరోకూ లేవంటారు. గతంలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన.. కొద్దిరోజులుగా స్పీడును తగ్గించారు. రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..?

కేఎస్ రవికుమార్ సినిమా

కేఎస్ రవికుమార్ సినిమా

గతంలో ‘జై సింహా' వంటి సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో బాలయ్య మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ, షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే, ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. భారీ షెడ్యూల్‌లో కీలక నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

బాలకృష్ణ రెండు షేడ్స్‌లో...

బాలకృష్ణ రెండు షేడ్స్‌లో...

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు షేడ్స్‌లో కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరొకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనేదే సినిమా కథ అని ఫిలింనగర్‌లో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అయితే, దీనిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఇందులో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తుండగా, భూమిక, జయసుధ కీలక పాత్రలు చేస్తున్నారు.

సరికొత్త లుక్‌లో బాలయ్య

సరికొత్త లుక్‌లో బాలయ్య

ఈ సినిమా బాలకృష్ణ ఏ పాత్రలో కనిపిస్తారన్న దానిపై ఎటువంటి క్లారిటీ లేకపోయినా.. తాజాగా ఆయనకు సంబంధించిన లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో బాలయ్య సన్నగా సరికొత్తగా కనిపిస్తున్నాడు. ఫ్రెంచ్ కట్ షేవ్‌తో హ్యాండ్సమ్‌గా దర్శనమిస్తున్నాడు. అంతేకాదు, ఈ పిక్‌లో బాలయ్య వయసు తగ్గిపోయిందన్నట్లుగా ఉంది. దీంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్రాంతి అనే టైటిల్

క్రాంతి అనే టైటిల్

ఈ సినిమా టైటిల్ విషయంలోనూ పలు పేర్లు తెరపైకి వచ్చాయి. దీనికి ‘రూలర్' టైటిల్ పెడుతున్నారని మొదట ప్రచారం జరిగినప్పటికీ, ఈ మధ్య మరో పేరు బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ సినిమాకు ‘క్రాంతి' అనే టైటిల్ పెట్టబోతునట్లు తెలుస్తోంది. దీనిని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట నిర్మాత కల్యాణ్.

దీని తర్వాత ఎవరితో?

దీని తర్వాత ఎవరితో?

ఈ సినిమా తర్వాత బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే, అది ఆగిపోయిందని అంటున్నారు. అలాగే, పూరీ జగన్నాథ్‌తోనూ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు దిల్ రాజు బ్యానర్‌లో ‘పింక్' రీమేక్‌లో నటిస్తారని వార్తలు వచ్చాయి. దీనికి ‘లాయర్ సాబ్' అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X