ఎన్టీఆర్ బయో పిక్ కోసమే సంచలన నిర్ణయం: బాలయ్య "బ్రహ్మతేజా ప్రొడక్షన్ బ్యానర్"

తన ఇద్దరు కూతుళ్లు బ్రహ్మణి, తేజస్వి పేర్లు కలిసొచ్చేలా బాలయ్య ‘బ్రహ్మతేజ క్రియేషన్స్’ పేరుతో ఒక కొత్త బ్యాన‌ర్ ప్రారంభిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దాదాపుగా మన టాలీవుడ్ లో చాలామంది అగ్రహీరోలకీ తమ సొంత ప్రొదక్షన్ అయిన హోమ్ బ్యానర్స్ ఉన్నాయి. ఇంకొందరు హీరోల‌కు సొంతంగానో లేదా వారి కుటుంబ స‌భ్యుల‌కో నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీలో రెండు మూడు నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. నాగ్‌కు అన్న‌పూర్ణ స్టూడియో, వెంకీకి సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఉన్నాయి.

 తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్

తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్

మ‌రో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్ తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ స్థాపించి సినిమాలు తీస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక మ‌రో అగ్ర‌హీరో బాల‌కృష్ణ కుటుంబానికి సొంత బ్యాన‌ర్ రామ‌కృష్ణ సినీ స్టూడియోస్ ఉంది. అయితే అది బాలయ్య వ్యక్తిగత ఆస్థి మాత్రం కాదు...

 ఎన్టీఆర్ బ‌యోపిక్

ఎన్టీఆర్ బ‌యోపిక్

ప్ర‌స్తుతం తాను తీయాల‌నుకుంటున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌ని తేజ‌ను బాల‌య్య కోరిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ బ‌యోపిక్ కు బాల‌య్యే నిర్మాతగా వ్య‌వ‌హ‌రించాల‌నుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. అందుకోసం ఓ సొంత నిర్మాణ సంస్థ‌ను ఏర్పాటు చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.

త‌న‌కంటూ సొంతంగా ఓ బ్యాన‌ర్

త‌న‌కంటూ సొంతంగా ఓ బ్యాన‌ర్

నేటి త‌రం హీరోల్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ లాంటి స్టార్లు ఎక్స్‌క్లూజివ్‌గా తమ కోసం ఒక బేనర్ పెట్టుకున్నారు. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ కోసం వీరి బాట‌లోనే న‌డుస్తున్నాడు. త‌న‌కంటూ సొంతంగా ఓ బ్యాన‌ర్ పెట్టుకుంటున్నాడు. తన ఇద్దరు కూతుళ్లు బ్రహ్మణి, తేజస్వి పేర్లు కలిసొచ్చేలా బాలయ్య ‘బ్రహ్మతేజ క్రియేషన్స్' పేరుతో ఈ కొత్త బ్యాన‌ర్ ప్రారంభిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

స్వ‌యంగా బాల‌య్యే నిర్మాతగా

స్వ‌యంగా బాల‌య్యే నిర్మాతగా

వ‌ర్మ‌...ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో బ‌యోపిక్ తీయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కొన్ని కార‌ణాల వ‌ల్ల స్వ‌యంగా బాల‌య్యే ఆ సినిమాకు నిర్మాతగా మారాలని భావిస్తున్నట్టు టాలీవుడ్ లో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. వేరే నిర్మాత‌లు త‌న ఆ బ‌యోపిక్ కు న్యాయం చేయ‌లేరేమో అన్న ఆలోచ‌న‌తో బాల‌య్య సొంత‌గా ఓ నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని పేర్ల మీద

బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని పేర్ల మీద

త‌న ఇద్ద‌రు కూతుళ్లు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని పేర్ల మీద 'బ్రహ్మతేజ ప్రొడక్షన్స్' పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పేందుకు బాలకృష్ణ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ బ్యానర్ లో నిర్మించబోయే తొలి సినిమా తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కావాల‌ని బాల‌య్య ఫిక్స్ అయ్యాడ‌ట‌.

 90ల్లోనే రిజిస్టర్ చేయించాడు

90ల్లోనే రిజిస్టర్ చేయించాడు

నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. బాలయ్య 90ల్లోనే ‘బ్రహ్మతేజ క్రియేషన్స్' బేనర్‌ను రిజిస్టర్ చేయించాడు. తన స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల'తో పాటు ఇంకొన్ని సినిమాలు చేయాలని సంకల్పించాడు బాలయ్య. కానీ అనివార్య కారణాల వల్ల అప్పుడు ఆ బేనర్ మీద సినిమాలు తీయడం కుదర్లేదు. ఐతే ఇప్పుడు తండ్రి బయోపిక్ కోసం ఈ బేనర్‌ను బయటికి తీశాడు బాలయ్య.

 ఎన్టీఆర్ బయోపిక్

ఎన్టీఆర్ బయోపిక్

ఈ బేనర్ మీద తీయబోయే తొలి సినిమాతో మంచి లాభాలు రాబట్టేందుకు బాలయ్య ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ అనగానే జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది కాబట్టి దీనికి బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగే అవకాశముంది. బడ్జెట్ అదుపులో ఉంచకుంటే భారీగా లాభాలు రావడానికి అవకాశముంది.

 బాలయ్య పట్టించుకోవడం తక్కువ

బాలయ్య పట్టించుకోవడం తక్కువ

మామూలుగా పారితోషకం గురించి, బడ్జెట్ల గురించి బాలయ్య పట్టించుకోవడం తక్కువ. ఐతే ఇప్పుడు ఆయనకు అన్నీ అనుభవంలోకి వస్తాయి. ఎన్టీఆర్ బయోపిక్‌తో మంచి ఫలితం అందుకుంటే మున్ముందు కూడా బాలయ్య ప్రొడక్షన్ కొనసాగించే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X