వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఊపందుకొన్నది. ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు తమ అస్త్రాలకు, వాగ్బాణాలకు పదును పెడుతూ.. ప్రత్యర్థి పార్టీలను, నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు ఆరోపణలు సంధిస్తున్నారు.ఈ క్రమంలో హిందూపూర్ నియోజకవర్గంలో ప్రచార హోరును కొనసాగిస్తున్న సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో విమర్శలు సంధించారు. తాజాగా ఆయన స్పీచ్ వివరాల్లోకి వెళితే..

అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టిన బాలయ్య ఇటీవల తన ప్రచారాన్ని కొనసాగించారు. హెలికాఫ్టర్ ద్వారా కదిరి నియోజకవర్గానికి చేరుకొన్న ఆయనకు భారీగా కార్యకర్తలు స్వాగతం పలికారు. అక్కడి నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.

Nandamuri Balakrishna quotes Mahesh Babu s Guntur Kaaram s Kurchi Madatapetti Song at Hindupur

ఇక హిందూపూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. నందమూరి సింహం రాకతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఇసుకవేస్తే రాలనంత జనం హాజరయ్యారు. జనసందోహాన్ని చూసిన ఆయన తన ప్రసంగాన్ని అంతే జోష్‌ను చూపించారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ హుషారెత్తించే మాటలు మాట్లాడారు.

ఈ సభలో బాలయ్య మాట్లాడుతూ..ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటూ అధికారాన్ని చేపట్టిన ఏపీ సీఎం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఇచ్చిన హామీలన్నీతుంగలో తొక్కాడు.ఇక ఆయన సీఎం కుర్చీని మడతపెట్టే రోజు వచ్చింది. ఆయన గుర్తు ఫ్యాన్ మూడు రెక్కలు విరిచి పారేయాల్సిందే అంటూ ఆయన తన ప్రసంగంలో విమర్శలు సాగించారు.

ఇక తన ప్రసంగంలో ఇటీవల విడుదలైన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలోని డైలాగ్స్‌ను కోట్ చేస్తూ మాట్లాడటంతో అభిమానులు, కార్యకర్తల నుంచి భారీ స్పందన వచ్చింది. ఆయన చెప్పే ప్రతీ డైలాగ్స్‌కు జనం ఈలలు, చప్పట్లు కొడుతూ తమ నాయకుడికి ఉత్సాహం కలిగించారు.ఈ సభ విజయవంతం కావడంతో బాలయ్య విజయం నల్లేరు మీద నడకనే అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X