twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తడి అందాలతో రకుల్.. 'ఆకుచాటు పిందె తడిసె' అంటూ బాలయ్య చిందులు!

    |

    స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిగ్గజ నటి శ్రీదేవి పాత్రలో రకుల్ ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. శ్రీదేవి పాత్రలో నటించడం తనకు దక్కిన గౌరవం అని రకుల్ ప్రీత్ తెలిపింది. నేడు రకుల్ ప్రీత్ సింగ్ శ్రీదేవి గెటప్ లో ఉన్న ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రకుల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఈ లుక్ విడుదల చేసింది. తాజాగా చిత్ర యూనిట్ అభిమానులని మరో మారు థ్రిల్‌కి గురిచేసింది.

    ఎవర్ గ్రీన్ సాంగ్

    ఎవర్ గ్రీన్ సాంగ్

    ఎన్టీఆర్, శ్రీదేవి జంటగా 1979 లో విడుదలైన వేటగాడు చిత్రంలో నటించారు. వేటగాడు చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఈ చిత్రంలో ఆకుచాటు పిందె తడిచే అంటూ సాగె రైన్ సాంగ్‌ని తెలుగువాళ్లు ఎప్పటికి మరచిపోలేరు. తడి అందాలతో శ్రీదేవి, గమ్మత్తైన స్టెప్పులతో ఎన్టీఆర్ వెండి తెరపై మ్యాజిక్ చేశారు.

     మైమరచిపోయేలా

    మైమరచిపోయేలా

    తాజగా ఆకుచాటు పిండే తడిచే సాంగ్ కు ఎన్టీఆర్ గెటప్‌లో బాలయ్య, శ్రీదేవిగా రకుల్ డాన్స్ చేస్తున్న స్టిల్ విడుదల చేశారు. వాళ్లిద్దరూ ఎన్టీఆర్, శ్రీదేవే కదా అని ఒక్క క్షణం మైమరచిపోయేలా ఈ స్టిల్ ఉంది. రకుల్ చీరకట్టులో శ్రీదేవిని మురిపిస్తోంది. ఇక బాలయ్య గురించి చెప్పనవసరం లేదు. అణువణువూ తన తండ్రిలా బాలయ్య మారిపోయాడు.

    నాపై నమ్మకం ఉంచి

    నాపై నమ్మకం ఉంచి

    తనపై నమ్మకం ఉంచి శ్రీదేవి పాత్రలో ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ స్టిల్ కు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వేటగాడు చిత్రంలోని ఎన్టీఆర్, శ్రీదేవి స్టిల్స్ తో బాలయ్య, రకుల్ ని పోల్చుకుంటూ ఫాన్స్ మురిపోతున్నారు.

     క్రిష్ ప్రతిభ

    క్రిష్ ప్రతిభ

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో దర్శకుడు క్రిష్ ప్రతిభ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. బాలయ్యని ప్రతి యాంగిల్ లో ఎన్టీఆర్‌ని తలపించేలా చూపిస్తున్నాడు. చంద్రబాబు పాత్రలో రానాని, ఏఎన్నార్ పాత్రలో సుమంత్‌ని అద్భుతంగా చూపించబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్స్ ఆకట్టుకున్నాయి.

    English summary
    The beautiful Rakul Preet will be seen playing legendary actress Sridevi in NTR biopic. Nandamuri Balakrishna and Rakul Preet recreate the vintage song.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X