twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆయనే పోలీసుల రూపంలో వచ్చి.. దిశా ఎన్‌కౌంటర్‌పై బాలకృష్ణ రియాక్షన్

    |

    Recommended Video

    Actor Balakrishna About Disha Incident

    దిశా నిందితులు నలుగురినీ ఈ రోజు (డిసెంబర్ 6) తెలంగాణ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. దీంతో గత పది రోజులుగా దిశగా నిందితులను చంపేయాలంటూ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్‌కి తెరపడింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ పోలీసుల పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    దిశా ఘటన.. ఉలిక్కిపడ్డ జనం

    దిశా ఘటన.. ఉలిక్కిపడ్డ జనం

    నవంబర్ నెల 27వ తేదీన షాద్ నగర్ సమీపంలో దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెపై పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. ఈ ఉదంతం యావత్ భారత దేశాన్ని కలచివేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో దిశ ఘటనలో నిందితులైన ఆ నలుగురినీ బహిరంగంగా చంపేయాలని అంతా నినదించారు.

    తప్పించుకునేందుకు ప్రయత్నం.. ఎన్‌కౌంటర్‌

    తప్పించుకునేందుకు ప్రయత్నం.. ఎన్‌కౌంటర్‌

    ఈ పరిస్థితుల నడుమ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురినీ నేడు (డిసెంబర్ 6) తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 మధ్య ఎన్‌కౌంటర్‌ చేశారు షాద్ నగర్ పోలీసులు. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు తప్పించుకునేందుకు యత్నించడంతో ఆ నలుగురిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం జరిగింది.

    పోలీసులు, గవర్నమెంట్‌పై బాలకృష్ణ కామెంట్

    పోలీసులు, గవర్నమెంట్‌పై బాలకృష్ణ కామెంట్

    ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బోయపాటితో తన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ దిశా ఎన్‌కౌంటర్‌ పై మీడియా ముఖంగా స్పందించారు. ఈ మేరకు తెలంగాణ గవర్నమెంట్, పోలీసుల పనితీరుపై కామెంట్స్ చేశారు.

    అతనే పోలీసుల రూపంలో వచ్చి..

    అతనే పోలీసుల రూపంలో వచ్చి..

    కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని అంటారు.. అలాగే ఈ రోజు తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్ భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి చేయవలసిన పనిని చేసి వెళ్లారని నమ్ముతున్నానని బాలయ్య పేర్కొన్నారు. ఇది చూసైనా మళ్లీ ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి అని బాలకృష్ణ అన్నారు.

    ఓ ఆడబిడ్డకు న్యాయం

    దిశా కేసులో నిందితులైన ఈ నలుగురి ఎన్‌కౌంటర్‌తో ఓ ఆడబిడ్డకు న్యాయం జరిగిందని బాలకృష్ణ అన్నారు. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని ఈ సందర్బంగా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలు అని బాల్లయ్యబాబు చెప్పారు.

    English summary
    The four accused in brutal rape and murder of veterinary doctor Disha have been encountered by Shamshabad police. Now tollywood senior hero Nandamuri Balakrishna reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X