కోడెల అంతిమయాత్రలో బాలకృష్ణ.. తీవ్ర భావోద్వేగంతో దుఃఖం ఆపుకోలేక!

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌‌ అంతిమయాత్రతో నరసారావుపేట శోక సముద్రంలో మునిగిపోయింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ వర్గాలు, ప్రజలు ఆయన అంతిమయాత్రలో భాగమయ్యారు. అయితే కోడెల శివప్రసాద్‌‌ అంతిమయాత్రతో పాల్గొన్న బాలకృష్ణ కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోడెలతో బాలకృష్ణకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆ కారణంగా దుఃఖం ఆపుకోలేక పోయారు బాలయ్య.

టీడీపీతో అనుబంధం.. శోక సముద్రంలో నందమూరి ఫ్యామిలీ

టీడీపీతో అనుబంధం.. శోక సముద్రంలో నందమూరి ఫ్యామిలీ

టీడీపీ పార్టీతో కోడెల అనుబంధం ఈ నాటిది కాదు. ఎన్టీఆర్ కాలం నుంచి తన తుదిశ్వాస విడిచే వరకు టీడీపీ పార్టీ వెన్నంటే ఉన్నారు కోడెల శివప్రసాద్. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీతో కోడెలకు మంచి అనుబంధం ఉండేది. ఈ నేపథ్యంలో పార్టీ వర్గాలు, నందమూరి ఫ్యామిలీ సభ్యులు కోడెల మరణంతో శోక సముద్రంలో మునిగిపోయారు.

తీవ్ర భావోద్వేగంతో బాలకృష్ణ

తీవ్ర భావోద్వేగంతో బాలకృష్ణ

సోమవారం రాత్రే ఎన్టీఆర్ ట్రస్ట్ భవనకు వచ్చి కోడెల మృత దేహానికి ఘన నివాళి అందించిన బాలకృష్ణ.. కోడెల మరణం పొందిన ఈ రోజు ఓ దుర్దినం అని అన్నారు. ఆయన మరణించారనే వార్త జీర్ణించుకోలేక పోతున్నామని చెప్పారు. ప్రస్తుతం ఆయన అంతిమయాత్రలో తీవ్ర భావోద్వేగంతో కనిపించారు బాలకృష్ణ.

చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ

చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ

కోడలె శివప్రసాద్ ఇంటి నుంచి అంత్యక్రియలు నిర్వహించే చోటుకు భారీగా జనం తరలివచ్చారు. ప్రస్తుతం జనసందోహం నడుమ అంతిమయాత్ర జరుగుతోంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా ఈ అంతిమయాత్రలో పాల్గొన్నారు. తమ నేతకు కన్నీటి వీడ్కోలు పలుకున్నారు.

బసవతారకం ఆస్పత్రి ప్రారంభించినపుడు

బసవతారకం ఆస్పత్రి ప్రారంభించినపుడు

బసవతారకం ఆస్పత్రి ప్రారంభించినపుడు ఆయనే ఫౌండర్ ఛైర్మెన్ అని గుర్తు చేసుకుంటూ ఆవేదన చెందారు బాలకృష్ణ. అప్పట్లో అమ్మగారి జ్ఞాపకార్థం నాన్నగారు ఆస్పత్రి నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నపుడు కోడెల ముందడుగు వేసి మంచి సహకారం అందించారని బాలకృష్ణ తెలిపారు. రాజకీయ నాయకుడిగానే గాక వైద్యుడిగా కూడా ఎన్నో సేవలందించిన కోడెలను తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని బాలకృష్ణ అన్నారు.

పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ

పల్నాటి బ్రహ్మనాయుడు మూవీ

బాలకృష్ణ హీరోగా బీ గోపాల్ దర్శకత్వంలో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు సినిమాను ఎక్కువ భాగం కోడెల శివప్రసాద్ ఇంట్లోనే షూటింగ్ చేశారు. బాలకృష్ణతో కోడెల ప్రత్యేక సంబంధాలు కలిగి ఉండేవారు. పలు అంశాల్లో బాలకృష్ణతో ఆలోచనలు పంచుకునే వారు కోడెల.

జీర్ణించుకోలేకపోతున్న నరసారావుపేట వాస్తవ్యులు

జీర్ణించుకోలేకపోతున్న నరసారావుపేట వాస్తవ్యులు

తమ అభిమాన నేత కోడెల శివప్రసాద్ లేరనే వార్తను నరసారావుపేట వాస్తవ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీటి పర్యంతమవుతూ అంతిమ వీడ్కోలు పలుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X