»   » కళ్ళు చెదిరిపోతాయ్....! గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ ఏర్పాట్లగురించి వింటే షాక్ తింటారు

కళ్ళు చెదిరిపోతాయ్....! గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో ఫంక్షన్ ఏర్పాట్లగురించి వింటే షాక్ తింటారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం తిరుపతిలోని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రు మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతుంది.'క్రిష్' దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈ రోజు సాయంత్రం తిరుపతిలో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాలతో సహా తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్లలో చిత్ర ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ వేడుకకి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు వెల్లడిస్తూ కరీంనగర్‌ జిల్లా కోటిలింగాల సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్లలో విడుదల చేసిన మా చిత్రం ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమా కోసం అందరూ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థమవుతోంది. సుమారు 25 వేల మంది ఆడియో వేడుకలను వీక్షించేలా ఏర్పాట్లు చేశామని నిర్మాతలు రాజీవ్‌రెడ్డి, బిబో శ్రీనివాస్‌ తెలిపారు. జై మీడియా ఈవెంట్‌ ప్రతినిధి నరేంద్రరాజు బృందం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అక్కడ వేడుకలో విశేషాలు మరి కొన్ని...


 గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి:

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి:

ఈ సాయంత్రం జరిగే వేడుక కోసం తిరుపతిలో జరుగుతున్న ఏర్పాట్లు అద్బుతంగా ఉన్నాయి. ఏదో ఉత్సవం జరుగుతున్నట్టు ముస్తాబయ్యింది తిరుపతి . రీసెంట్‌గా విడుద‌లైన గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండెస్ రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రే తెలుగు సినిమా ట్రైల‌ర్స్‌కు లేని విధంగా యూ ట్యూబ్ చానెల్‌లో హ‌య్య‌స్ట్ వ్యూస్‌తో గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఓ సెన్సేష‌న‌ల్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ స్పంద‌న‌తో చిత్ర‌యూనిట్ ఈ సినిమా ఆడియో ఆవిష్క‌ర‌ణ వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఈ వేడుక‌కు కేంద్ర‌మంత్రి వెంక‌య్య‌నాయుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ముఖ్య అతిథులుగా హాజ‌ర‌వుతున్నారు.


 101 కొబ్బరి కాయలు:

101 కొబ్బరి కాయలు:

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విజయవంతం కావాలంటూ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు బాలకృష్ణ అభిమాన సంఘం నేతలు అలిపిరి పాదాల వద్ద 101 కొబ్బరి కాయలు కొట్టారు. అక్కడ్నుంచి 100 మంది అభిమానులు తిరుమలకు నడచి వెళ్లారు. అనంతపురం జిల్లా నుంచి వచ్చేసిన బాలకృష్ణ అభిమాన సంఘం నేత జగన్‌ ఆధ్వర్యంలో అలిపిరి నుంచి నగర వీధుల్లో బైకులు, కార్ల ర్యాలీ నిర్వహించారు.


 టీడీపీ నేతలు:

టీడీపీ నేతలు:

ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు నరసింహయాదవ్‌, శ్రీధర్‌వర్మ, ఆలిండియా బాలకృష్ణ ఫ్యాన్స్‌ నేతలు సతీష్‌, శ్రీధర్‌, మనోహర్‌రెడ్డి, తిలక్‌, జగన్‌, కోరా పృథ్వీ చౌదరి, లోకేష్‌, భాస్కర్‌ వర్మ, శేఖర్‌నాయుడు తది తరులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం గ్రాండ్‌ రిడ్జ్‌ నుంచి మున్సిపల్‌ పాఠశాల మైదానం వరకు జరిగే ర్యాలీలో బాలకృష్ణ పాల్గొననున్నారు.


మరో సెన్సేషన్:

మరో సెన్సేషన్:

గౌతమిపుత్ర శాతకర్ణి ఆడియో విడుదల కార్యక్రమం కోసం రూపొందించిన ఆహ్వాన పత్రం ఇప్పుడు మరో సెన్సేషన్ అయ్యింది. ఎప్పుడు లేని విధంగా, గౌతమిపుత్ర శాతకర్ణి డిజిటల్ ఆడియో ఇన్విటేషన్ అదిరింది. ఈ డిజిటల్ ఇన్విటేషన్ లో మొత్తం నాలుగు భాగాలు ఉండగా..


శాతకర్ణి ట్రైలర్:

శాతకర్ణి ట్రైలర్:

1 నంబర్ ప్రెస్ చేస్తే.. బాలయ్య గురించి.. 2వ నంబర్ లో క్రిష్ గురించి ఆడియో వీడియో విజువల్స్ వస్తాయి. ఇక 3వ నంబర్ లో శాతకర్ణి ట్రైలర్ ను ఉంచగా... 4ను ప్రెస్ చేసినపుడు ఆడియో రిలీజ్ వేడుక.. వేదిక.. తేదీ.. సమయం.. అతిథుల లిస్ట్ వస్తుంది.


క్రిష్':

క్రిష్':

'క్రిష్' దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈ రోజు సాయంత్రం తిరుపతిలో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాలతో సహా తెలుగు రాష్ట్రాల్లోని 100 థియేటర్లలో చిత్ర ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే.


English summary
At the foothills of Tirumala and with the blessings of Lord Balaji, the big event of Nandamuri Balakrishna’s historical 100th film Gautamiputhra Satakarni audio function will be held at Sri Pandit Jawaharlal Nehru Municipal High School Grounds, Tirupathi on December 26th (Today). GPSK is the most happening film and this function is most awaited event for Telugu people in all parts of the world.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu